Motorola Edge 20: అత్యంత సన్నని 5G స్మార్ట్ ఫోన్ గా వస్తోంది…ఫీచర్లు కూడా అదుర్స్..!

Updated on 15-Aug-2021
HIGHLIGHTS

Motorola Edge 20 ను ఇండియాలో విడుదల చేస్తోంది

ఈ ఫోన్ కేవలం 6.99 mm మందంతో చాలా సన్నని స్టైలిష్ డిజైన్ తో వస్తోంది

నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS తో వస్తుంది

మోటోరోలా తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 20 ను ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 6.99 mm మందంతో చాలా సన్నగా మరియు స్టైలిష్ డిజైన్ తో వస్తోంది. కేవలం ఇదొక్కటేకాదు ఈ ఫోన్  చాలా ప్రీమియం ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే టీజర్ అందించింది. ఈ ఫోన్ ను ఆగష్టు 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు డేట్ ప్రకటించింది. దీనితో పాటుగా ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్ల గురించి కూడా వెల్లడించింది. మరి ఆ ఫీచరులేమిటో, ఈ ఫోన్ ఎలా ఉండబోతోందో చూసేద్దామా…!

Motorola Edge 20 స్మార్ట్ ఫోన్ ను అత్యున్నతమైన ఫీచర్లతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఫోన్ ను తీసుకువస్తోంది. ఈ మోటో ఫోన్ లో HDR 10+ సపోర్ట్ కలిగి గరిష్టంగా 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లేని అందించినట్లు తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఇండియాలో స్నాప్ డ్రాగన్ 778G 5G చిప్ సెట్ తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఎడ్జ్ 20 అవుతుంది. ఈ ఫోన్ కూడా ఎటువంటి యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేకుండా క్లీన్ OS నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS తో వస్తుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో  ప్రీమియం కెమెరా సెటప్ అందిందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ లో 108MP హై రిజల్యూషన్ సెన్సార్ కలిగిన ట్రిపిల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 16MP అల్ట్రా వైడ్ కెమెరా + మ్యాక్రో విజన్ కెమెరా మరియు 3X టెలిఫోటో జూమ్ అందించగల 8MP సెన్సార్ OIS తో వస్తుంది. అంటే, 30X సూపర్ జూమ్ ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాతో లభిస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :