Motorola announces Motorola Upcoming smartphone launch
Motorola Upcoming స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈరోజు అనౌన్స్ చేసింది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన మోటోరోలా ఇప్పుడు అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుందో తెలిపే చిన్న చిన్న హింట్ లను కూడా అందించారు. మరి మోటోరోలా విడుదల చేయనున్న ఆ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏమిటో చూద్దామా.
ఫ్లిప్ కార్ట్ మొబైల్ స్టోర్ పేజీ నుంచి విడుదల చేసిన టీజర్ బ్యానర్ పేజీ నుంచి మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్మెంట్ అందించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి కూడా అందించింది. ఈ పేజీ నుండి ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఒక అవగాహన ఇస్తున్నాయి. మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ లేదా స్మార్ట్ ఫోన్ వివరాలు కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు.
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరు లేదా లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించకపోయినా, ఈ ఫోన్ ఫీచర్స్ తెలియజేసే టీజర్ ఇమేజ్ లతో హింట్స్ మాత్రం ఇస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 3D కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫీచర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక ప్రీమియం వేగాన్ లెథర్ ఉన్నట్లు కూడా మరో ఇమేజ్ తెలియ చేస్తుంది. ఇదే ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ గ్రీన్, గ్రే, బ్లూ మరియు పింక్ నాలుగు రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని హింట్ ఇస్తోంది. ఆఫ్ కోర్స్, ఈ ఫోన్ కలర్స్ మనం చెప్పుకునే సింపుల్ భాషలో ఉండకపోవచ్చనుకోండి.
Also Read: Poco F7 ఫోన్ లో మిమ్మల్ని ఆకట్టుకునే టాప్ 5 ఫీచర్స్ ఇవే కావచ్చు.!
ఈ ఫోన్ కెమెరా వివరాలు మాత్రం క్లియర్ గా కనిపించేలా మోటోరోలా ఈ ఫోన్ కెమెరా టీజర్ ఇమేజ్ ను అందించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 50MP SonyLYTIA OIS మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని చూపించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా ఊరిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్, ఫోన్ పేరు మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ కూడా త్వరలో మోటోరోలా వెల్లడించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. చూద్దాం ఏ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి టీజింగ్ స్టార్ట్ చేసిందో.