MOTO Pad 60 Neo launched with moto pen wifi and 5g support
MOTO Pad 60 Neo టాబ్లెట్ ను మోటోరోలా ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ బడ్జెట్ ధరలో వైఫై తో పాటు 5జి నెట్వర్క్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. మోటరోలా ఈ కొత్త బడ్జెట్ టాబ్లెట్ ను మంచి ఆఫర్ తో అందించడం ద్వారా బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. మోటరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ టాబ్లెట్ ధర మరియు కంప్లీట్ ఫీచర్లు తెలుసుకోండి.
మోటరోలా ఈ కొత్త టాబ్లెట్ ను రూ. 17,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ కొత్త టాబ్లెట్ ను కేవలం రూ. 12,999 రూపాయల అతి తక్కువ ధరలోనే అందుకోవచ్చని అనౌన్స్ చేసింది. ఈ టాబ్లెట్ పై గొప్ప బ్యాంకు మరియు ఎక్స్ చేంజ్ బోనస్ డీల్స్ అందించింది. వీటి ద్వారా ఈ టాబ్లెట్ ను ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చని చెబుతోంది. మోటో ప్యాడ్ 60 నియో టాబ్లెట్ మొదటి సేల్ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టాబ్లెట్ ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుంచి ఈ టాబ్లెట్ లభిస్తుంది.
Also Read: Nothing Ear 3: కొత్త రూపం మరియు కొత్త Talk బటన్ తో టీజింగ్ చేస్తున్న నథింగ్.!
మోటో ప్యాడ్ 60 నియో టాబ్లెట్ 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 2.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ కేవలం 6.5mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ మోటోరోలా టాబ్లెట్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో నడుస్తుంది, ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో సింగిల్ 5G SIM కార్డు ఉపయోగించవచ్చు మరియు 5జి స్మార్ట్ ఫోన్ మాదిరిగా కాలింగ్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ మోటో టాబ్లెట్ Wi-Fi మరియు 5G సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మోటో పెన్ మరియు గూగుల్ సర్కిల్ టు సెర్చ్ సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది. ఇందులో 4 స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందించింది. ఈ మోటో టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఈ టాబ్లెట్ 7040 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఆర్ట్ అండ్ డిజైన్, బిజినెస్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన పార్ట్నర్ అవుతుందని మోటోరోలా చెబుతోంది.