MOTO Pad 60 Neo టాబ్లెట్ బడ్జెట్ ధరలో మోటో పెన్ మరియు 5G తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

MOTO Pad 60 Neo టాబ్లెట్ ను మోటోరోలా ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

ఈ టాబ్లెట్ బడ్జెట్ ధరలో వైఫై తో పాటు 5జి నెట్వర్క్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది

ఈ కొత్త టాబ్లెట్ ను కేవలం రూ. 12,999 రూపాయల అతి తక్కువ ధరలోనే అందుకోవచ్చని అనౌన్స్ చేసింది

MOTO Pad 60 Neo టాబ్లెట్ బడ్జెట్ ధరలో మోటో పెన్ మరియు 5G తో లాంచ్ అయ్యింది.!

MOTO Pad 60 Neo టాబ్లెట్ ను మోటోరోలా ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ బడ్జెట్ ధరలో వైఫై తో పాటు 5జి నెట్వర్క్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. మోటరోలా ఈ కొత్త బడ్జెట్ టాబ్లెట్ ను మంచి ఆఫర్ తో అందించడం ద్వారా బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. మోటరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ టాబ్లెట్ ధర మరియు కంప్లీట్ ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MOTO Pad 60 Neo : ప్రైస్

మోటరోలా ఈ కొత్త టాబ్లెట్ ను రూ. 17,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ కొత్త టాబ్లెట్ ను కేవలం రూ. 12,999 రూపాయల అతి తక్కువ ధరలోనే అందుకోవచ్చని అనౌన్స్ చేసింది. ఈ టాబ్లెట్ పై గొప్ప బ్యాంకు మరియు ఎక్స్ చేంజ్ బోనస్ డీల్స్ అందించింది. వీటి ద్వారా ఈ టాబ్లెట్ ను ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చని చెబుతోంది. మోటో ప్యాడ్ 60 నియో టాబ్లెట్ మొదటి సేల్ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టాబ్లెట్ ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుంచి ఈ టాబ్లెట్ లభిస్తుంది.

Also Read: Nothing Ear 3: కొత్త రూపం మరియు కొత్త Talk బటన్ తో టీజింగ్ చేస్తున్న నథింగ్.!

MOTO Pad 60 Neo : ఫీచర్స్

మోటో ప్యాడ్ 60 నియో టాబ్లెట్ 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 2.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ కేవలం 6.5mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ మోటోరోలా టాబ్లెట్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో నడుస్తుంది, ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో సింగిల్ 5G SIM కార్డు ఉపయోగించవచ్చు మరియు 5జి స్మార్ట్ ఫోన్ మాదిరిగా కాలింగ్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOTO Pad 60 Neo

ఈ మోటో టాబ్లెట్ Wi-Fi మరియు 5G సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మోటో పెన్ మరియు గూగుల్ సర్కిల్ టు సెర్చ్ సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది. ఇందులో 4 స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందించింది. ఈ మోటో టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఈ టాబ్లెట్ 7040 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఆర్ట్ అండ్ డిజైన్, బిజినెస్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన పార్ట్నర్ అవుతుందని మోటోరోలా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo