ఆన్లైన్లో పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో కనిపించిన మోటరోలా స్మార్ట్ ఫోన్

Updated on 10-Oct-2019
HIGHLIGHTS

ఫుల్‌వ్యూ డిజైన్‌తో కంపెనీ ఫోన్‌కు సన్నని బెజల్స్ ఇవ్వవచ్చు.

మోటరోలా త్వరలో తన వన్ సిరీస్ నుండి ప్రస్తుత మోటోరోలా వన్ మాక్రో తరువాత మరొక సరి కొత్త ఫోన్ తీసుకురావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో రావచ్చు. ఈ ఫోనుకు సంబంధించి మోటరోలా సంస్థ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ ఫోన్ యొక్క స్పెక్స్ లేదా ఫీచర్ల గురించి మాట్లాడితే, దీని గురించి ఎక్కువగా ఏమితెలియ లేదు. కానీ, తాజా నివేదికల ప్రకారం, ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో స్పెక్స్‌తో కనిపించింది.

స్పానిష్ పబ్లికేషన్ అయినా ProAndroid ప్రకారం, ఈ పరికరంలో 6.39-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్ప్లేను FHD+ రిజల్యూషన్‌తో ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో నోచ్ లేదు మరియు ఫుల్‌వ్యూ డిజైన్‌తో కంపెనీ ఫోన్‌కు సన్నని బెజల్స్ ఇవ్వవచ్చు.

ఇక ఈ ప్రచురణను పూర్తిగా విశ్వసిస్తే, మీరు ఫోన్‌లో ఆప్టిమస్ బ్రైట్నెస్ ని పొందుతారు, తద్వారా మీరు ఎండలో కూడా ఉత్తమ చిత్రాలను తీయవచ్చు. ఆప్టిక్స్ గురించి మాట్లాడుతుంటే, కంపెనీ ఫోన్‌లో మోటరైజ్డ్ సెల్ఫీ కెమెరాను అందించవచ్చు, దీనిలో 32 MP సెన్సారును ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో అమర్చవచ్చు.

ఈ ఫోన్‌లో మూడు వెనుక కెమెరాలు అమర్చవచ్చు, ఇందులో 64 MP ప్రైమరీ కెమెరానుf  / 1.8 ఎపర్చర్‌తో ఇవ్వవచ్చు. అదే సమయంలో, మిగిలిన సెన్సార్లు f / 2.2 ఎపర్చర్‌తో 8MP మరియు డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ ఫోనుకు 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను స్నాప్‌డ్రాగన్ 675 SoC తో ఇవ్వవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :