Moto G86 Power 5G లాంచ్ అనౌన్స్ చేసిన మోటోరోలా: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Updated on 23-Jul-2025
HIGHLIGHTS

Moto G86 Power 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు మోటోరోలా అనౌన్స్ చేసింది

బడ్జెట్ సిరీస్ గా పేరొందిన G సిరీస్ నుంచి చాలా వేగంగా ఫోన్ లను విడుదల చేస్తోంది

ఈ ఫోన్ లో విజువల్స్ మరియు గేమింగ్ కు తగిన 1.5K సూపర్ HD రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన pOLED ఉంటుంది

Moto G86 Power 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్, స్టన్నింగ్ కెమెరా మరియు గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటుందని మోటోరోలా ఈ ఫోన్ గురించి గొప్పగా టీజింగ్ చేస్తోంది. మోటోరోలా సక్సెస్ ఫుల్ బడ్జెట్ సిరీస్ గా పేరొందిన G సిరీస్ నుంచి చాలా వేగంగా ఫోన్ లను విడుదల చేస్తోంది.

Moto G86 Power 5G : లాంచ్

మోటో జి పవర్ 5జి స్మార్ట్ ఫోన్ ను జూలై 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేసినట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం చేప్పట్టిన టీజర్ పేజీ నుని ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది.

Moto G86 Power 5G : ఫీచర్లు

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జి 86 పవర్ మీడియాటెక్ Dimensity 7400 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 24 జీబీ వరకు ర్యామ్ బూస్ట్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో విజువల్స్ మరియు గేమింగ్ కు తగిన 1.5K సూపర్ HD రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన pOLED ఉంటుంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో కూడా ఉంటుంది.

మోటో జి పవర్ 5జి స్మార్ట్ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP Sony LYT 600 మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాని మోటోరోలా అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ moto ai సపోర్ట్ తో గొప్ప AI Camera ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ డిజైన్ చేసినా ఇందులో 6,720 mAh పవర్ ఫుల్ బ్యాటరీ అందించింది. ఈ ఫోన్ 33W టర్బో ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read: X (Twitter) Down: పూర్తిగా డౌన్ అయిన ఎలన్ మస్క్ ‘X’ ప్లాట్ ఫామ్.!

ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ మరియు MIL – 810H సర్టిఫికేషన్ తో చాలా పటిష్టమైన అమరికలో ఉంటుంది. ఈ ఫోన్ వేగాన్ లెథర్ డిజైన్ లో మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :