మోటో బడ్జెట్ పవర్ స్మార్ట్ ఫోన్ Moto G8 Power Lite సేల్ ఈరోజు జరగనుంది

Updated on 29-May-2020
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ‌ఫోన్ మీడియాటెక్ హెలియో P 35 చిప్సెట్ తో నడుస్తుంది

ఈ మోటరోలా స్మార్ట్‌ ఫోన్ లాంగ్ బ్యాటరీ జీవితంతో తక్కువ ధరలో వచ్చిన స్మార్ట్‌ ఫోను‌గా నిలిచింది.

ఇటీవల, పెద్ద బ్యాటరీతో పవర్ హౌస్ లాగా మోటోరోలా ఇండియాలో విడుదల చేసినటువంటి  Moto G8 Power Lite యొక్క మొదటి  సెల్ ఈరోజు మద్యహ్నం 12 గంటలకి Flipkart ద్వారా జరగనుంది. ఈ మోటరోలా స్మార్ట్‌ ఫోన్ లాంగ్  బ్యాటరీ జీవితంతో తక్కువ ధరలో వచ్చిన స్మార్ట్‌ ఫోను‌గా నిలిచింది. ఈ స్మార్ట్ ‌ఫోన్ మీడియాటెక్ హెలియో P 35 చిప్సెట్ తో నడుస్తుంది మరియు 5,000mAh బ్యాటరీని తీసుకొస్తుంది.

భారతదేశంలో మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ :ధర

ఈ మోటో జి 8 పవర్ లైట్ సింగిల్ వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ .8,999. ఈ ఫోన్ ఎంచుకోవడానికి రెండు రంగులు ఉన్నాయి – ఆర్కిటిక్ బ్లూ మరియు రాయల్ బ్లూ.

మీరు మోటో జి 8 పవర్ లైట్ కొనాలని ప్లాన్ చేస్తే మీకోసం ఫ్లిప్‌కార్ట్ అదనపు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోలు చేస్తే మీకు 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాబట్టి, దీని ధర 8,549 రూపాయలకు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుండి  EMI ప్లాన్స్ కూడా అందిస్తోంది.

మోటో జి 8 పవర్ లైట్ : ప్రత్యేకతలు

మోటో జి 8 పవర్ లైట్ మీడియాటెక్ హెలియో పి 35 చిప్ సెట్ శక్తితో నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై లో స్టాక్ UI తో నడుస్తుంది. ఈ ఫోన్ HD + రిజల్యూషన్ ‌తో కాంపాక్ట్ 6.5-అంగుళాల HD + IPS LCD డిస్ప్లే తో రాక్ చేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజితో రోజువారీ ప్రాథమిక ఉపయోగం కోసం తయారు చెయ్యబడిన ఫోన్ ఇది.

మోటో జి 8 పవర్ లైట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది, ఇది 16 MP ప్రైమరీ కెమెరాతో f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.  దీనితో మరొక 2 MP డెప్త్ సెన్సార్ మరియు 2 MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్, ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ నోచ్ లో ఉంచబడింది.

స్మార్ట్ ఫోన్ 256GB వరకు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించదగిన స్టోరేజితో  వస్తుంది మరియు 10W ఛార్జింగ్ కి మద్దతుతో 5,000mAh బ్యాటరీపై నడుస్తుంది. 4G LTE, బ్లూటూత్ 4.2 కు మద్దతు ఉంది మరియు మైక్రో- USB స్లాట్ తో వస్తుంది. ఇందులో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం బ్యాక్-మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్ ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :