Moto G57 Power ఆండ్రాయిడ్ 16 వంటి భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Updated on 24-Nov-2025
HIGHLIGHTS

Moto G57 Power స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ గా ఈ మోటోరోలా లేటెస్ట్ ఫోన్ నిలుస్తుంది

ఈ ఫోన్ 7000 mAh సిలికాన్ కార్బన్ బిగ్ బ్యాటరీ తో వచ్చింది

Moto G57 Power స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ గా ఈ మోటోరోలా లేటెస్ట్ ఫోన్ నిలుస్తుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలోనే ఈ చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. సోనీ 4K కెమెరా, మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ డిజైన్, పెద్ద డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది.

Moto G57 Power : ప్రైస్

మోటో జి57 పవర్ స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ. 13,999 ధరతో మోటోరోలా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పై రూ. 1,000 డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు SBI కార్డ్స్ తో లేదా ఎక్స్ చేంజ్ ద్వారా తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 12,999 ధరలో లభిస్తుంది.

Moto G57 Power : ఫీచర్స్

మోటో జి57 పవర్ స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన 6.72 ఇంచ్ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1050 HBM బ్రైట్నెస్, స్మార్ట్ వాటర్ టచ్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 16 జీబీ ర్యామ్ బూస్ట్ సపోర్ట్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ స్మార్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో చేస్తుంది.

ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP సోనీ LYT 600 మైన్ సెన్సార్ 8MP అల్ట్రా వైడ్ మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HD వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మోటో Ai తో ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 15 వేలకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

ఈ ఫోన్ 7000 mAh సిలికాన్ కార్బన్ బిగ్ బ్యాటరీ తో వచ్చింది మరియు వేగవంతమైన చార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MIL-810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటి డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP 64 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో డాల్బీ అట్మాస్ మరియు Hi-Res ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ తో వస్తుంది మరియు అల్ట్రా ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ తో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :