Moto G42: ఈరోజు విడుదలైన మోటో ఫోన్.. ధర మరియు ఫీచర్లు ఇవే..!!
Moto G42 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల అయ్యింది
బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని మోటోరోలా ఈ ఫోన్ ను ప్రవేశపెట్టింది
ఫీచర్ల పరంగా బడ్జెట్ వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది
Moto G42 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని మోటోరోలా ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. మోటో జి42 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా బడ్జెట్ వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP క్వాడ్ ఫిక్షన్ కెమెరా, Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , బిగ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కూడా కలిగి వుంది. మోటోరోలా యొక్క ఈ తాజా స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్ల వివరాలను తెలుసుకుందామా.
SurveyMoto G42: ధర
మోటోరోలా యొక్క మోటో జి42 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది మరియు దీని ధర రూ.13,999. జూలై 11 వ టీటీఈ నుండి ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. మోటోరోలా ఈ ఫోన్ పైన లాంచ్ అఫర్ ను కూడా ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Moto G42: స్పెక్స్ మరియు ఫీచర్లు
Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు 100%DCI-P3 కలర్ గ్యామూట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మెమొరీ కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతో కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ 2MP మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS మరియు వాటర్ రిపెలెంట్ IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా జతచేసింది. ఈ ఫోన్ మెటాలిక్ రోజ్ మరియు అట్లాంటిక్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile