బడ్జెట్ Dolby Atmos సౌండ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.. ఎప్పుడంటే..!!
Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో ప్రకటించిన Moto G42 ఫస్ట్ సేల్
మోటో జి42 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది
Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది
ఇటీవల మోటోరోలా కేవలం బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో ప్రకటించిన Moto G42 స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనుంది. ఈ మోటో జి42 స్మార్ట్ ఫోన్ జూలై 11వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ, 50MP క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , బిగ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కోసం చూస్తున్నారు వారు ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి ఈ క్రింద చూడవచ్చు.
SurveyMoto G42: ధర
మోటోరోలా యొక్క మోటో జి42 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది మరియు దీని ధర రూ.13,999. జూలై 11 వ తేదీ నుండి ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. మోటోరోలా ఈ ఫోన్ పైన లాంచ్ అఫర్ ను కూడా ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Moto G42: స్పెక్స్ మరియు ఫీచర్లు
Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు 100%DCI-P3 కలర్ గ్యామూట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మెమొరీ కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతో కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ 2MP మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS మరియు వాటర్ రిపెలెంట్ IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా జతచేసింది. ఈ ఫోన్ మెటాలిక్ రోజ్ మరియు అట్లాంటిక్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile