మోటో G10 ఫోన్ పెద్ద 6000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది

Updated on 09-Mar-2021
HIGHLIGHTS

మోటో G10 కూడా స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

48ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్

బడ్జెట్ ధరలో 6000mAh బ్యాటరీ

మోటోరోలా మోటో G10 ఈరోజు ఇండియాలో మోటో G30 తో పాటుగా లాంచ్ చెయ్యబడింది. మోటో G10 కూడా స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. అంతేకాదు, 48ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 6000mAh బ్యాటరీ మరియు 20W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, మంచి వేగవంతమైన నెట్వర్క్ కోసం 2 X 2 MIMO తో వస్తుంది. 

మోటో G10: ధర

మోటో G10 (4జీబీ + 64 జీబీ ) : రూ.9,999

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.  

మోటో G10: ప్రత్యేకతలు

ఈ మోటో G10 స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది.  ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన వాటర్ డ్రాప్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ తో వస్తుంది. ఈ G10 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  460 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది నియర్ ఆండ్రాయిడ్ 11-స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా, మోటో G10 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో వాటర్ డ్రాప్ నోచ్ లోపల 8 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 20W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :