ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ Micromax ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Micromax In 2b ను షాకింగ్ ధరతో ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ In 1b యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద HD డిస్ప్లే, వేగవంతమైన ప్రొసెసర్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మంచి ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చింది. అంతేకాదు, ఇది ఇండియన్ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్/ 64జిబి స్టోరేజ్ కలిగి కేవలం రూ.7,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఇక మరొక వేరియంట్ 6జిబి ర్యామ్/ 64జిబి స్టోరేజ్ కలిగి రూ.8,999 ధరతో ప్రకటించబడింది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ వంటి మూడు విభిన్నమైన కలర్స్ లో లభిస్తుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ డిజైన్ కలిగి ఉంటుంది. మిట్టమధ్యాహ్నం ఎండలో కూడా చక్కగా కనిపించేలా ఈ డిస్ప్లే 400 నైట్స్ బ్రైట్నెస్ టి వస్తుంది. ఈ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ మరియు 6జిబి ర్యామ్ తో జతగా వస్తుంది. SD కార్డు సహాయంతో 256 జిబి వరకూ స్టోరేజ్ మరితంగా విస్తరించవచ్చు.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో రెండవ లెన్స్ 2మెగాపిక్సెల్ లెన్స్ వుంటుంది. ఈ కెమెరా సెటప్ నైట్ మోడ్, పోర్ట్రైట్, మోషన్ ఫోటో మరియు బ్యూటీ ఫోటో వంటి ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి పెద్ద 5000 mah బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో కలిగివుంది.