ఈ Mi సూపర్ సేల్ ద్వారా షావోమి ఎంచుకున్న తన స్మార్ట్ ఫోన్ల పైన అత్యధిక మైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రెడ్మి నోట్ 5 ప్రో , నోట్ 6 ప్రో మరియు పోకో F1 పైన గరిష్టంగా రూ.6,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ సేల్ నుండి పోకో F1 యొక్క రోస్ రెడ్ కలర్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి వేరియంట్ ని కేవలం రూ.20,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఇక షావోమి స్మార్ట్ ఫోన్లన్నింటిలో అత్యధికమైన అమ్మకాలను సాధించిన రెడ్మి నోట్ 5 ప్రో యొక్క 6 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజి వేరియంట్ ని కేవలం రూ.11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి, ఈ స్మార్ట్ యొక్క ఈ వేరియంటును రూ. 17,999 ధరతో విడుదల చేసింది. అంటే, దీని పైన 6000 రూపాయల డిస్కౌంట్ ని షావోమి సంస్థ అందిస్తోంది.
అలాగే, ముందు మరియు వేనుక భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో వచ్చినటువంటి, కెమేరా సెంట్రిక్ ఫోన్ అయిన రెడ్మి నోట్ 5 ప్రో యొక్క 6GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజి వేరియంట్ ని కేవలం రూ.13,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోను పైన కూడా 4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.
ఇంకా, ఈ సేల్ నుండి రెడ్మి 6A, Mi A2, రెడ్మి Y2 మరియు రెడ్మి 6 వంటి స్మార్ట్ ఫోన్ల పైన కూడా గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ద్వారా రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.7,999 ప్రారంభదరతో కొనవచ్చు. అలాగే, రెడ్మి 6 ఫోన్ను రూ.7,499 మరియు రెడ్మి 6A ఫోన్ను రూ. 5,999 ధరతోను మీ సొంతం చేసుకునే అవకాశాన్ని షావోమి ఈ సేల్ ద్వారా అందిస్తోంది.