రేపటి నుండే Mi ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ : ఒక్క రూపాయి అఫరుతో రెడ్మి నోట్ 7 ప్రో గెలుచుకునే అవకాశం

రేపటి నుండే Mi ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ : ఒక్క రూపాయి అఫరుతో రెడ్మి నోట్ 7 ప్రో గెలుచుకునే అవకాశం
HIGHLIGHTS

మి సౌండ్ బార్ కూడా ఆఫర్లో భాగంగా ఉంటుంది.

కేవలం ఒక్క రూపాయికే, రెడ్మి నోట్ 7 ప్రో అమ్మకం ఏమిటి? అనుకుంటున్నారు కదూ!. అవును, ఇది అక్షరాలా నిజమే. ఎలాగంటే,         షావోమి సంస్థ ఈ ఏప్రిల్ 4 వ తేదీ నుండి 6 వ తేదీ వరకూ Mi Fan Festival sale నిర్వహించనుంది. అందులో భాగంగా అనేక ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో, మి ఫాన్స్ కోసం Rs 1 సేల్ నిర్వస్తుంది, ప్రతుతం జరగనున్న ఈ సేల్ నుండి కూడా ఈ Rs.1 సేల్ నిర్వహించనుంది.

ఈ సెల్లో, ఇటీవల కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్మి నోట్ 7 ప్రో ని Rs.1 అఫర్ క్రింద అమ్మనుండి. అయితే, కేవలం 20 యూనిట్లను మాత్రమే ఈ 1 రూపాయి సేల్ క్రింద అమ్ముతుంది. అలాగే, మి సౌండ్ బార్ యొక్క 20 యూనిట్లను కూడా ఈ 1 రూపాయి సేల్ క్రింద అమ్మనునట్లు ప్రకటించింది. ఈ సేల్, 4 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు రోజు మధ్యాహ్నం 2 గంటలకి నిర్వహిస్తుంది. కాబట్టి, ఈ 20 యూనిట్లలో ఒకటి మీదే ఎందుకు కాకూడదు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం 2 గంటలకి సేల్ జరుగుతుంది కాబట్టి ట్రై చేసి చూడడంలో తప్పులేదు కదా!

అధనంగా, అనేక డీల్స్ అఫర్ మరియు ఫన్ గేమ్స్  షావోమి సంస్థ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. అంతేకాకుండా, HDFC యొక్క కార్డ్స్ మరియు EMI ట్రాన్సాక్షన్స్ పైన 5% తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, Mi Pay ద్వారా క్యాష్ చెల్లించడంతో రెడ్మి నోట్ మరియు Mi టీవీలను గెలుచునే అవకాశం కూడా దక్కుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo