Mi 11 Ultra 120X జూమ్ కెమెరా, రెండు స్క్రీన్స్ తో వచ్చింది

Updated on 30-Mar-2021
HIGHLIGHTS

షియోమి తన 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది

11 సిరీస్ నుండి Mi 11 Ultra, Mi 11 Lite మరియు Mi 11i ఫోన్లను లాంచ్ చేసింది

120X జూమ్, QHD+ డిస్ప్లే మరియు మరిన్ని భారీ ఫీచర్లు

షియోమి తన 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది. ఈ 11 సిరీస్ నుండి Mi 11 Ultra, Mi 11 Lite మరియు Mi 11i  ఫోన్లను గ్లోబల్లి లాంచ్ చేసింది. వీటిలో మి 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ వెనుక మినీ రియర్ డిస్ప్లేతో పాటు వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలతో సిరామిక్ బిల్డ్ కలిగి ఉంది. ఈ ఫోన్, 120X జూమ్, QHD+ డిస్ప్లే మరియు మరిన్ని భారీ ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది.       

Mi Ultra: ప్రత్యేకతలు

మి 11 అల్ట్రా పెద్ద 6.81-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది QHD + (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్‌ అందిస్తుంది మరియు పంచ్-హోల్ నాచ్ కటౌట్‌ను సెల్ఫీ కెమెరా కోసం కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు ఇస్తుండడమే కాకుండా  Dolby Vision తో పాటుగా HDR10 + ప్లేబ్యాక్ కోసం కూడా ధృవీకరించబడింది. ఈ స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ పొరతో పటిష్టంగా ఉంది.

అధనంగా, వెనుకవైపున కూడా ఒక చిన్న స్క్రీన్ వుంది. ఈ సెకండరీ  స్క్రీన్ 1.1-అంగుళాల మినీ AMOLED డిస్ప్లే . ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి మద్దతు ఇస్తుంది మరియు నోటిఫికేషన్స్ మరియు మరిన్ని వివరాలను చూపిస్తుంది. దీనిని సిరామిక్ వైట్ మరియు బ్లాక్ రంగులలో అందిస్తున్నారు. ఈ ఫోన్ 8.38 మిల్లీమీటర్ల మందం మరియు 234 గ్రాముల బరువు ఉంటుంది. ఇది IP68 రేటింగ్ తో వస్తుంది మరియు 1.5 మీటర్ల వరకు 30 నిమిషాల పాటు దుమ్ము మరియు నీటి ప్రవేశానికి నిరోధకతను కలిగిస్తుంది.

మి 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ ‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 60 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ అవుట్-ఆఫ్-బాక్స్‌ MIUI 12 లో నడుస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ F / 2.0 ఎపర్చరు మరియు OIS మద్దతుతో 50MP ప్రాధమిక కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 120X వరకు డిజిటల్ జూమ్ అందించగల 48MP పెరిస్కోప్ కెమెరా మరియు 128-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. . వెనుక కెమెరాలు 24 fps వద్ద 8K మరియు 60 fps వరకు 4K  UHD లో రికార్డ్ చేయగలవు. ముందు వైపు, నాచ్ కటౌట్ లోపల 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

మి 11 అల్ట్రాలో Harman Kardon ఆప్టిమైజ్ చేసిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ వైర్డ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 36 నిమిషాలు మాత్రమే పడుతుంది.

షియోమి 12GB + 256GB స్టోరేజ్ మోడల్ కోసం Mi 11 అల్ట్రా యొక్క ధరను EUR 1,199 గా నిర్ణయించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :