హానికరమైన SDK వలన పెద్దమొత్తంలో Facebook మరియు Twitter వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది

Updated on 26-Nov-2019
HIGHLIGHTS

లీకైనట్లు, ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ రెండూ ప్రకటించాయి.

మరోసారి పెద్ద మొత్తంలో డేటా లీక్ అయినట్లు కనిపిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసిన కొన్ని యాప్‌లలోకి లాగిన్ అవ్వడానికి తమ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించే అనేకమంది వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైనట్లు, ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ రెండూ ప్రకటించాయి.

తన అధికారిక ప్రకటనలో, ట్విట్టర్ వల్నరబిలిటీ అనేది ట్విట్టర్ యొక్క సాఫ్ట్‌వేర్ కాదని, ఒక యాప్ లో SDK ల మధ్య సామరస్యం లేకపోవడం అని పేర్కొంది. మైక్రో-బ్లాగింగ్ సైట్, వన్ ఆడియన్స్ చేత నిర్వహించబడే SDK ను మొబైల్ అప్లికేషన్‌లో పొందుపరచవచ్చు మరియు మొబైల్ ఏకో సిస్టంలో వల్నరబిలిటీ (హానికారకమైనవి) ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇది ఇమెయిల్, వినియోగదారు పేరు మరియు చివరి ట్వీట్ వంటి వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ను కలిగి ఉంటుంది. SDK ను ఒక ఖాతాను స్వాధీనం చేసుకోవడనికి ఉపయోగించినట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనబడనప్పటికీ, అలా చేయడం సాధ్యమేనని ట్విట్టర్ పేర్కొంది. అయినప్పటికీ, ఇది ఆండ్రాయిడ్‌లోని కొంతమంది ట్విట్టర్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి ఉపయోగించినట్లు ఆధారాలు కనుగొనబడ్డాయి, కాని SDK యొక్క iOS వెర్షన్ iOS కోసం ట్విట్టర్‌ను ఉపయోగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది. హానికరమైన SDK గురించి గూగుల్ మరియు ఆపిల్ రెండింటికి తెలియజేసినట్లు ట్విట్టర్ పేర్కొంది, కాబట్టి వారు ఆ సంస్థలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.

సిఎన్‌బిసి ఒక ప్రకటనలో, ఫేస్‌బుక్ ప్రతినిధి వన్ ఆడియెన్స్‌తో పాటు, మోబిబర్న్ కూడా హానికరమైన ఎస్‌డికెలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. తమ సొంత దర్యాప్తు తరువాత, ఫేస్బుక్ ప్లాట్ఫాం నుండి ఈ యాప్స్ ను తొలగించిందని మరియు ఇది వన్ఆడియెన్స్ మరియు మొబిబర్న్ లకు వ్యతిరేకంగా నిలిపివేత చర్యలు మరియు లెటర్స్ ను విడుదల చేసిందని పేర్కొంది.

ఫేస్బుక్ మరియు ట్విట్టర్ రెండూ ఈ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుకు, వ్యక్తిగతంగా ఈ విషయాన్ని తెలియజేయాలని యోచిస్తున్నాయి. యూజర్లు తమ ఖాతాకు ఏటువంటి మూడవ పార్టీ (థర్డ్ పార్టీ ) యాప్స్ కు అధికారం ఇచ్చారో తనిఖీ చేయాలని మరియు వారు గుర్తించని లేదా ఇకపై ఉపయోగించని వాటిని తొలగించాలని ట్విట్టర్ వినియోగదారులకు సలహా ఇస్తుంది. యాక్సెస్ ను మంజూరు చేయడానికి మూడవ పార్టీ (థర్డ్ పార్టీ ) అప్లికేషన్లను ఎంచుకునేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఫేస్బుక్ సలహా ఇస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :