రిలయన్స్ LYF స్మార్ట్ ఫోన్ పేలుడు జరిగి త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డ ఇండియన్ ఫ్యామిలీ

Updated on 07-Nov-2016

రిలయన్స్ LYF స్మార్ట్ ఫోన్ కూడా సామ్సంగ్, ఆపిల్ తరువాత పేలుడు స్మార్ట్ ఫోన్స్ లిస్టు లోకి చేరుకుంది. అవును ఈ సంఘటన తాజాగా నిన్న ఇండియన్ user కు జరిగింది.

ఈ విషయాన్ని వినియోగదారుడు ట్విటర్ లో పెట్టగా విషయం బయటకు వచ్చింది. "త్రుటిలో ప్రమాదం తప్పింది మా ఫ్యామిలీ కు. LYF ఫోన్ సడెన్ గా దాని అంతట అదే పేలి మంటల్లో కాలిపోయింది" అన్నారు ఫోన్ వాడకందారు, Tanvir.

దీనికి వెంటనే రిలియన్స్ కూడా స్పందించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు వెల్లడించింది కంపెని. అయితే పేలుడు ఎదుర్కొన్న user అది రిలియన్స్ LYF అని చెప్పారు కాని ఇంతవరకూ అది ఏ మోడల్ అనేది తెలపలేదు. క్రింద అతని tweet ఇమేజెస్ చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :