లీకైన మోటోరోలా వన్ విజన్ నమూనాలు ఒక పంచ్ హోల్ డిస్ప్లే మరియు 48MP ప్రధాన కెమెరా గురించి వివరిస్తున్నాయి.
ఈ ఫోన్ డిస్ప్లే యొక్క ఎగువ ఎడమ మూలలో ఒక పంచ్ హోల్లో సెల్ఫీ కెమెరా ఉండవచ్చు.
బ్రెజిల్లోని సావో పాలోలో తన విజన్ వన్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు మోటోరోలా తెలియజేస్తోంది. రాబోయే ఈ హ్యాండ్సెట్ గురించి వివరాలు క్రమంగా బయటకు రావడంతోపాటు దాని గురించిన ఫీచర్లు, హార్డ్వేర్ల గురించి వివరాలు వెల్లడవుతున్నాయి. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క తాజా రెండర్లు ఆన్లైన్లో కనిపించాయి, దీని డిజైన్ మరియు కలర్ వేరియంట్ల గురించి వివరిస్తున్నాయి. MobielKopen మోటరోలా వన్ విజన్ యొక్క రెండర్లను విడుదల చేసింది, ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లేతో రానున్న ఈ సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా చెప్పవచ్చు. ఈ రెండర్స్ ద్వారా పరిశీలిస్తే, ఈ ఫోన్ డిస్ప్లే యొక్క ఎగువ ఎడమ మూలలో ఒక పంచ్ హోల్లో సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. అలాగే, ఒక డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ మరియు మోటరోలా బ్యాట్ లోగోను కలిగి ఉన్న వేలిముద్ర సెన్సారుతో పాటుగా ఉంచినట్లు అంచనా వేయవచ్చు.
Surveyడ్యూయల్ కెమెరాలు చూపే రెండెర్లలో ఒకదానిని జూమ్ చేయడంతో కొన్ని కీలక కెమెరా వివరాలు కనిపించాయి. మోటరోలా విజన్ వన్ f / 1.7 ఎపర్చరు లెన్స్ మరియు OIS తో 48MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఇది ఈ పరికరానికి ముందుగా వెల్లడించిన ఇమేజికి అనుగుణంగా ఉంది. అంతేకాక, ఈ ఫోన్ డార్క్ బ్లూ కలర్ మోడల్ లో రాబోతుందని కూడా సూచిస్తోంది.
మోటరోలా విజన్ వన్ ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 6.2-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే ఈ స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 21: 9 మరియు 2520×1080 పిక్సల్స్ రిజల్యూషనుతో ఉండవచ్చు. అలాగే, శామ్సంగ్ Exynos 9610 SoC తో ఈ హ్యాండ్సెట్ నడుస్తుండవచ్చు మరియు 32GB, 64GB మరియు 128GB అంతర్గత స్టోరేజి నుండి ఎంచుకోవడానికి ఎంపికలతో 3GB మరియు 4GB RAM మోడళ్లలో చేయబడుతుంది. చివరగా, ఈ హ్యాండ్సెట్ను 3,500mAh బ్యాటరీతో మద్దతుగా ఇస్తుంది మరియు USB టైప్-సి పోర్ట్, వేగవంతమైన ఛార్జింగుకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
