Lava Upcoming Mobile with dual screen announced
Lava Upcoming Mobile: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. లావా ప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం లావా టీజింగ్ స్టార్ట్ చేసింది మరియు ఈ ఫోన్ టీజర్ వీడియో కూడా విడుదల చేసింది. ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన అప్‌డేట్ పై ఒక లుక్కేయండి.
లావా కొత్త ఫోన్ కోసం కొత్త టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ డిజైన్ మరియు మరికొన్ని కీలక వివరాలు తెలిసేలా కూడా చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం కొత్త టీజర్ ను విడుదల చేసింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ లేదా పేరును ఇంకా ప్రకటించలేదు. అయితే, డ్యూయల్ స్క్రీన్ తో అగ్ని సిరీస్ నుంచి అగ్ని 3 ఫోన్ అందించిన కంపెనీ ఇప్పుడు లావా బడ్జెట్ సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: BSNL 2026 Offer: ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో డైలీ 500MB అదనపు డేటా అందుకోండి.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ ను ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ టీజర్ వీడియో లో ఈ ఫోన్ లో రెండు స్క్రీన్స్ ఉన్నట్లు చూపించింది. అంటే, ఈ ఫోన్ లో ముందు ప్రధాన బిగ్ స్క్రీన్ తో పాటు వెనుక ఫోన్ లో పైన రైట్ సైడ్ లో రెండో చిన్న స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ లో నోటిఫికేషన్ మరియు మరిన్ని ఇతర వివరాలు అందిస్తుంది. ఈ సెటప్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, లావా గత సంవత్సరం అందించింది లావా అగ్ని 3 ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది.
ఈ ఫోన్ లో ఉండే కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్ టీజర్ వీడియో ద్వారా బయటపెట్టింది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ లో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో లేటెస్ట్ చిప్ సెట్, పెద్ద బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇది లావా నుంచి వచ్చే మరో 5G ఫోన్ మరియు ఈ ఫోన్ లో బడ్జెట్ 5జి ప్రోసెసర్ ఉండవచ్చని ఊహిస్తున్నారు.
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా లావా త్వరలోనే అందిస్తుంది. ఈ లావా అప్ కమింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.