Lava Play Ultra 5G first sale started with huge discount offers
లావా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Lava Play Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. లావా ఈ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకోండి.
లావా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) ని కేవలం రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) ని రూ. 16,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. అన్ని ప్రధాన బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డు పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లాంచ్ ఆఫర్ లో భాగంగా లావా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 13,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లభిస్తుంది.
లావా ప్లే అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు సన్నని అంచులు కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 12GB వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు 2 సంవత్సరాల మేజర్ అప్డేట్స్ తో పాటు 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 64MP Sony IMX682 మెయిన్ సెన్సార్ జతగా 5MP మ్యాక్రో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ EIS సపోర్ట్ తో వస్తుంది మరియు 4K వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైమ్ లాప్స్, HDR మోడ్ మరియు నైట్ మోడ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Realme P4 5G: రూ. 3,500 భారీ ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన సేల్.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, లావా ప్లే అల్ట్రా లో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్లే అల్ట్రా ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ నోయిస్ క్యాన్సిల్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ మైక్ మరియు మంచి సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.