Lava Play Max 5G: బడ్జెట్ ప్రైస్ లో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 10-Dec-2025
HIGHLIGHTS

స్వదేశీ మొబైల్ తయారీ కంపెనీ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Lava Play Max 5G ఫోన్ ను బడ్జెట్ ప్రైస్ తో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ లావా స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 4nm ప్రోసెసర్ Dimensity 7300 పై నడుస్తుంది

Lava Play Max 5G: స్వదేశీ మొబైల్ తయారీ కంపెనీ లావా కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆఫ్ లైన్ మార్కెట్ కోసం ప్రవేశపెట్టింది మరియు ఈ ఫోన్ ను బడ్జెట్ ప్రైస్ తో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను విలక్షణమైన డిజైన్, 7 లక్షల AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు వేపర్ ఛాంబర్ కూలింగ్ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది.

Lava Play Max 5G: ప్రైస్

లవ్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను కేవలం రూ. 12,999 ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను కూడా కేవలం రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి అన్ని రిటైల్ స్టోర్స్ నుంచి లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై అన్ని బ్యాంకుల ఫైనాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని లావా తెలిపింది. ఈ ఫోన్ డెక్కన్ బ్లాక్ మరియు హిమాలయన్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.

Lava Play Max 5G: ఫీచర్స్

లావా ప్లే మాక్స్ స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ FHD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 4nm ప్రోసెసర్ Dimensity 7300 పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ LPDDR4X ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

ఈ లేటెస్ట్ లావా స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ ఫోటోలు వీడియోలు కోసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ కలిగి ఉంటుంది. 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ ను అందించింది.

Also Read : Realme P4x 5G First Sale: ఈ ఫోన్ ను తక్కువ ధరలో పొందాలంటే ఫస్ట్ సేల్ మిస్సవ్వకండి.!

గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ సమయంలో వేడిగా అవ్వకుండా వేగంగా చల్లబరిచే వేపర్ కూలింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ తో కూడా ఇంటి వద్దే ఉచిత సర్వీస్ ను లావా ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :