lava launches Lava Storm Lite 5G under 8k in India
Lava Storm Lite 5G : ఈరోజు లావా ఇండియాలో విడుదల చేసిన స్టార్మ్ సిరీస్ ఫోన్ లలో లావా స్టార్మ్ లైట్ 5జి ఫోన్ కూడా ఒకటి. ఈ ఫోన్ ను కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అయితే, బడ్జెట్ ధరలో కూడా ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించడం విశేషం. 10 వేల బడ్జెట్ ధరలో ఇప్పటికే మార్కెట్లో కొసాగుతున్న చాలా బడ్జెట్ ఫోన్లకు పోటీగా లావా ఈ ఫోన్ విడుదల చేసింది.
లావా స్టార్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కూడా ఆఫర్ ధరతోనే అందించింది మరియు ఈ ఆఫర్ ధర లిమిటెడ్ స్టాక్ పై మాత్రమే వర్తిస్తుందని లావా తెలిపింది. ఈ లావా కొత్త ఫోన్ జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఆస్ట్రల్ బ్లూ మరియు కాస్మిక్ టైటానియం రెండు రంగుల్లో లభిస్తుంది.
లావా ఈ ఫోన్ ను స్లీక్ మరియు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ తో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియా ఫస్ట్ మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ ఫోన్ గ లాంచ్ చేసింది. అంతేకాదు దీనికి జతగా 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS తో రన్ అవుతుంది.
ఈ లావా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 ఇంచ్ HD ప్లస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX752 ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గ్ కూడా ఉంటుంది. లాప్ స్టార్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 14W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఇండియన్ 5జి బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
Also Read: Lava Storm Play 5G: 10 వేల బడ్జెట్ లో LPDDR5 RAM తో లాంచ్ అయ్యింది.!
లాప్ స్టార్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా అందించింది. లాప్ స్టార్మ్ లైట్ 5జి స్మార్ట్ ఫోన్ కూడా ఉచిత హోమ్ సర్వీస్ పరిధిలోకి వస్తుంది మరియు ఇంటి వద్దే రిపేర్ సర్వీస్ పొందే అవకాశం అందిస్తుంది.