Lava Bold N2 Pro: ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ప్రకటించిన లావా.!

HIGHLIGHTS

లావా మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

బోల్డ్ ఎన్ 2 సిరీస్ నుంచి ప్రో మోడల్ ను ఇప్పుడు లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది

ఎన్ 2 ప్రో ఫోన్ Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది

Lava Bold N2 Pro: ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. లావా యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన బోల్డ్ ఎన్ 2 సిరీస్ నుంచి ప్రో మోడల్ ను ఇప్పుడు లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 50MP ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Lava Bold N2 Pro: లాంచ్

లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది.

Lava Bold N2 Pro: కీలక ఫీచర్స్

లావా బోల్డ్ ఎన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఎన్ 2 ప్రో ఫోన్ Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది.

ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS తో లంచ్ చేస్తున్నట్లు కూడా లావా తెలిపింది. ఇది ఎటువంటి యాడ్స్ లేడీ బ్లోట్ వేర్ లేకుండా మంచి ఎక్స్ పీరియన్సు ఇస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా అందిస్తున్నట్టు లావా ప్రకటించింది. ఈ ఫోన్ లో కూడా లావా కెమెరా ఫిల్టర్లు మరియు మంచి ai కెమెరా ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 5000 mah బిగ్ బ్యాటరీ మరియు టైప్ C చార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: SONY Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ ఆఫర్స్ అందుకోండి.!

లావా ఈ ఫోన్ ను ఎక్లిప్స్ గ్రే మరియు అరోరా గోల్డ్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కూడా లావా ఉచిత హోమ్ సర్వీస్ లాంచ్ అవుతుంది ఇది బడ్జెట్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి, బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యే ఆకాశం ఉంటుంది. ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది మరియు సరికొత్త రంగుల్లో కూడా వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ రోజు ప్రైస్ అండ్ ఫీచర్స్ తో మళ్లి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :