Lava Bold N1 and Bold N1 Pro launched under 7k in India
ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఈరోజు రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. లావా ఈరోజు Lava Bold N1 మరియు Bold N1 Pro రెండు ఫోన్లు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా అండర్ రూ. 7,000 ధరలు అందించబడ్డాయి. లావా సరికొత్తగా అందించిన ఈ రెండు కొత్త ఫోన్ల ధర మరియు ఫీచర్స్ వివరంగా చూద్దాం.
లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరతో అందించింది. ఈ ఫోన్ జూన్ 4వ తేదీ నుంచి సేల్ అవుతుంది. లావా బోల్డ్ ఎన్ 1 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 6,699 రూపాయల ఆఫర్ ధరతో అందించింది. ఈ ఫోన్ జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ ధరలు ఆఫర్ తో కలుపుకొని అందించిందని గమనించాలి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రైస్ మాత్రమే.
లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ Unisoc ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. లావా బోల్డ్ ఎన్ 1 స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని రెగ్యులర్ 10W ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం గ్లాసీ డిజైన్ తో ఉంటుంది మరియు రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక సింగల్ రియర్ మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: ఈరోజు 17 వేల బడ్జెట్ లో లభిస్తున్న 43 ఇంచ్ QLED Smart Tv డీల్ గురించి తెలుసా.!
లావా బోల్డ్ ఎన్ 1 ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ HD+ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 240+ AnTuTu స్కోర్ కలిగిన Unisoc T606 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో కూడా 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ 128GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ తో మంచి లుక్స్ తో వస్తుంది మరియు టైటానియం గోల్డ్ మరియు స్టెల్త్ బ్లాక్ రెండు కలర్స్ లో లభిస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.