Lava Blaze X స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన లావా.. ఫోన్ ఎలా ఉందంటే.!
Lava Blaze X లాంచ్ చేయబోతున్నట్లు లావా అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ యొక్క రెండర్ తో లావా టీజింగ్ కూడా మొదలు పెట్టింది
ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది
Lava Blaze X స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నట్లు లావా అనౌన్స్ చేసింది. లావా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన బ్లేజ్ సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించని కంపెనీ త్వరలోనే ఈ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
SurveyLava Blaze X
లావా బ్లేజ్ X స్మార్ట్ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ తో త్వరలో లాంచ్ చేయనున్నట్లు లావా ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండర్ తో లావా టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా అమెజాన్ ఇండియా ను ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన టీజర్ పేజిని అందించింది మరియు ఈ పేజీ నుండి ఈ ఫోన్ టీజర్ వివరాలను అందిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది.

ఈ ఫోన్ ను లావా బడ్జెట్ సిరీస్ నుండి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది కాబట్టి, ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రవేశపెట్టే అవకాశం ఉండవచ్చు. అయితే, ఈ ఫోన్ రెండర్ల ద్వారా ఈ ఫోన్ ట్రెండీ ఫీచర్ లతో వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ రెండర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా డిజైన్ తో కనిపిస్తోంది.
Also Read: Realme C61 ఫోన్ ను కేవలం రూ. 7,499 ధరతో టఫ్ డిజైన్ తో లాంచ్ చేసింది.!
లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో కర్వ్డ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా ఈ టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. లావా ఇప్పటికే తన బడ్జెట్ సిరీస్ అయిన బ్లేజ్ సిరీస్ నుంచి మంచి బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లను అందించింది. అందుకే, ఈ సిరీస్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ఫీచర్లను కూడా త్వరలోనే అందించే అవకాశం ఉండవచ్చు.
లావా ఈ ఫోన్ గురించి అందించే అప్డేట్స్ మరియు ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాము.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile