Lava Agni 4 : టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

Updated on 17-Nov-2025
HIGHLIGHTS

లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి హైప్ అందుకుంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా చాలా ఫీచర్స్ కూడా అఫీషియల్ గా వెల్లడించింది

ఆన్‌లైన్ లో లీకైన కొన్ని లీక్స్ Lava Agni 4 ఫోన్ పూర్తి వివరాలు బయటపెట్టాయి

Lava Agni 4 : లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి హైప్ అందుకుంది. ఇది ఇండియన్ మొబైల్ బ్రాండ్ అందించే ఫోన్ కావడం మరియు ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో పాటు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండటం ఈ ఫోన్ పై చర్చ జరగడానికి కారణం అవుతుంది. లావా ఇప్పటికే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా చాలా ఫీచర్స్ కూడా అఫీషియల్ గా వెల్లడించింది. ఇది కాకుండా ఆన్‌లైన్ లో లీకైన కొన్ని లీక్స్ ఈ ఫోన్ పూర్తి వివరాలు బయటపెట్టాయి.

Lava Agni 4 : టాప్ 5 ఫీచర్స్

డిజైన్

లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి ఇపోహోనే మరియు గూగుల్ పిక్సెల్ ఫోన్ రెండింటి కలయిక కలిసిన డిజైన్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 5G చిప్ సెట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా 8GB LPDDR5x ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.0 256GB ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ ఫీచర్ తో ఫోన్ కూల్ అవుతుంది.

కెమెరా

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ మరియు ముందు సెంటర్ పూంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన మెయిన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు మంచి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

బ్యాటరీ

ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 66W ఫస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ ను అందిస్తుంది.

AI ఫీచర్స్

లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన AI అసిస్టెంట్ బటన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఇండియన్ ఆర్టిఫిషియల్ మైండ్ Vayu AI సపోర్ట్ తో వస్తుంది. ఇది మరింత శక్తివంతంగా మరియు వేగంగా ఉంటుందని లావా తెలిపింది.

Also Read: LG Dolby Soundbar పై అమెజాన్ వన్ డే బిగ్ డీల్: 6 వేలకే సౌండ్ బార్ అందుకోండి!

Lava Agni 4 : అంచనా ధర

ప్రస్తుతానికి ఈ ఫోన్ అంచనా ధర గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇప్పటి వరకు కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మాత్రమే అందించిన లావా ఈ ఫోన్ ను ఏ బడ్జెట్ లో అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉన్న మాట అక్షర సత్యం. అయితే, ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. అంటే, రూ. 25,000 నుంచి రూ. 30,000 రూపాయల బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మన ఈ ఫోన్ కచ్చితమైన ప్రైస్ కోసం మనం వేచి చూడాల్సిందే.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :