best 55 inch smart tv deal under rs 22000 on flipkart
Lava Agni 4 : ఇండియన్ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీలో కొత్త పోటీని రేకెత్తించేలా కనిపిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ ధరలో అంచనా వేయలేని ఫీచర్స్ తో చాలా ఫోన్లు అందించిన లావా, ఇప్పుడు మరో జబర్దస్త్ ఫోన్ లాంచ్ కోసం సిద్దమయ్యింది. లావా కొత్తగా విడుదల చేసిన లాంచ్ టీజర్ ద్వారా లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అగ్ని 4 మెటల్ ఫ్రేమ్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది.
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అగ్ని 4 లాంచ్ కోసం కంపెనీ అధికారిక x పేజీ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ తర్వలోనే ఇండియన్ మార్కెట్లో సందడి చేస్తుందని లావా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఇండియన్ యూజర్ల మనసు దోచుకునేలా ఉంటుందని లావా చెబుతోంది. చైనా మొబైల్ తయారీ కంపెనీ నుంచి వచ్చే ఫోన్ల నుంచి వచ్చే తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఫోన్లను అందిస్తున్న ఈ స్వదేశీ కంపెనీ అందించే ఈ కొత్త ఫోన్ విశేషాలు లావా ఒక్కొక్కటిగా బయటకు వెల్లడించడం మొదలు పెట్టింది.
లావా అగ్ని స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ లను లావా తన అఫీషియల్ x అకౌంట్ నుంచి పోస్ట్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుటున్నట్లు అర్ధం అవుతుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంటుందని లావా ఈరోజు కన్ఫర్మ్ చేసింది. రెగ్యులర్ ప్లాస్టిక్ బాడీ కాకుండా ఈ ఫోన్ మెటల్ బాడీ కలిగి ఉంటుంది.
అంతేకాదు, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో 360 డిగ్రీల యాంటెన్నా ఉన్నట్లు కూడా అర్థం అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక పైన అడ్డంగా ఫీల్ షేప్ లో కెమెరా సెటప్ ఉన్నట్లు ఈ ఇమేజ్ కనిపిస్తుంది. లావా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ కోడోత్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి.
Also Read: Big Deal: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
ఆన్లైన్ చక్కర్లు కొడుతున్న లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ ద్వారా, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని కూడా ఈ లీక్స్ చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ గా నడుస్తున్న 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని కూడా ఊహించి చెబుతున్నారు.
లావా ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది కాబట్టి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా త్వరలోనే అందిస్తుంది.