Lava Agni 4 కీలక ఫీచర్స్ రివీల్ చేసిన లావా.!

Updated on 10-Nov-2025
HIGHLIGHTS

Lava Agni 4 స్మార్ట్ ఫోన్ ఈ నెల 20వ తేదీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతుంది

ఈ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజులుగా ఆటపట్టిస్తున్న లావా

లావా ఈరోజు ఈ ఫోన్ కీలక ఫీచర్లు రివీల్ చేసింది

Lava Agni 4 స్మార్ట్ ఫోన్ ఈ నెల 20వ తేదీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజులుగా ఆటపట్టిస్తున్న లావా, ఈరోజు ఈ ఫోన్ కీలక ఫీచర్లు రివీల్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ వెల్లడించి ఈ ఫోన్ ఫోన్ పై హైప్ పెంచిన కంపెనీ ఇప్పుడు ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ తో హైప్ పెంచడం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కొత్త టీజర్ ద్వారా ఈ వివరాలు బయటకు వెల్లడించింది.

Lava Agni 4 : కీలక ఫీచర్స్ ఏమిటి?

లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ తో అందరి మనసు దోచుకుంది. ఇందుకు కారణం ఈ ఫోన్ కలిగిన అద్భుతమైన డిజైన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం సిగ్నల్ యాంటెన్నా లతో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక జిఫ్ నోటిఫికేషన్ లైట్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందుగా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ వివరాలు వెల్లడించింది.

ఇక ఈ ఫోన్ యొక్క కొత్త టీజర్ అందించిన కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కలిగిన ప్రోసెసర్ గురించి కంపెనీ డీటెయిల్స్ ‘రివీల్ చేసింది. అదేమిటంటే, లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.0 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ఇది 14 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు గొప్ప పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఇక మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే VC లిక్విడ్ కూలింగ్ సిస్టం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ఫోన్ ను చాలా వేగంగా చల్లబరుస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో అందిస్తోంది. ఈ ఫోన్ లూనార్ మిస్ట్ మరియు ఫాంటమ్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు స్టైలిష్ లుక్స్ తో ఉంటుంది.

Also Read: BSNL రూ. 1 అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగుస్తుంది.!

Lava Agni 4 : అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ మరియు గొప్ప బ్రైట్నెస్ సపోర్ట్ తో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్, IP69 వాటర్ రెసిస్టెంట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :