జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు..

జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు..
HIGHLIGHTS

ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది

ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కలిగి వుంది.

ఈ జీయోఫోన్ 2 అన్ని జియో యాప్స్ కి మద్దతిస్తుంది.

512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.

జియో ఫోన్ 2 యొక్క మరొక సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. కొనుగోలుదారులు, మధ్యాహ్నం 12 గంటలకి jio.com మరియు myjio ఆప్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు జరిగిన అమ్మకాలలో అత్యధికమైన అమ్మకాలను సాధించిన ఈ ఫోను వినియోగధారులకి మంచి ప్రయోజనాలను అందించే ఆఫర్లతో వస్తుంది. అధనంగా, అతితక్కువ ధరలో 4G కాలింగ్ మరియు డేటా వంటి ఆఫర్లతో మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కేవలం రూ.2,999 ధరలో QWERTY కీబోర్డు, నాలుగు-మార్గాల నావిగేషన్ కీ, 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ వంటి ప్రత్యేకతలతో వస్తుంది.                   

జియోఫోన్ 2 ప్లాన్స్

రిలయన్స్ జీయో నుంచి మూడు పథకాలతో జియోఫోన్ 2 ని జతచేసారు. రూ . 48 ప్లాన్ వినియోగదారులకు 1జీబీ  డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత అపరిమిత కాలింగ్ మరియు జీయో యాప్స్ 28 రోజులు చెల్లబాటునిస్తుంది. ఇంకా  రూ .99 ప్లాన్, 14 జీబి డేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాక్సెస్ కి 28 రోజులు అందుబాటులో ఉంటుంది. చివరగా, జియో నుండి రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్  కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్, 28 రోజులు విశ్వసనీయ చెల్లుబాటు తో  అందిస్తుంది. 

జియోఫోన్ 2 స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్స్

జియోఫోన్ 2 లో గుర్తించదగిన మార్పులలో ఒకటిగా QWERTY కీబోర్డుగా చెప్పవచ్చు, ఇది నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో ఉంటుంది, ఇది పాత బ్లాక్ బెర్రీ ఫోన్లను మనకు గుర్తుకు  తెస్తుంది.  ఈ డివైజ్ క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి  వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.

ఈ ఫోన్ 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ  అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.

కనెక్టవిటీ విషయానికి వస్తే , వోల్టి(voLTE)  కు మద్దతు ఇస్తుంది, అయితే, ఇది VoWiFi కు మద్దతు ఇస్తుంది మరియు మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టికాస్ట్ సర్వీస్ (eMBMS) ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఫోన్ NFC, Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ తక్కువ శక్తికి కూడా మద్దతు ఇస్తుంది మరియు దీనిలో FM రేడియో అంతర్నిర్మితంగా ఉంటుంది.

యాప్స్ మద్దతు గురించి చూస్తే , ఈ జీయోఫోన్ 2 అన్ని జియో యాప్స్ కి మద్దతిస్తుంది:మై జియో, జియో మ్యూజిక్,  జియో సినిమా,జియో ఎక్సప్రెస్ న్యూస్, వాయిస్ అసిస్టెంట్,జియో వీడియో కాల్, జియో గేమ్స్ లాంటివి. ఇంకా కావాల్సిన పేస్ బుక్యా, యు ట్యూబ్,మరియు వాట్సాప్  వంటివాటిని జియో స్టోర్ నుండి పొందేవీలుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo