JioPhone Prima: ఈరోజు నుండి మొదలైన జియో New ఫీచర్ ఫోన్ సేల్.!

HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన JioPhone Prima ఫీచర్ ఫోన్ సేల్.

జియో కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ ఫోన్ JioPhone Prima

వాట్సాప్, యూట్యూబ్ ను కూడా ఇందులో ఆనందించవచ్చు

“2G Mukt Bharat” కోసం దేశీయ మార్కెట్ లో రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ ఫోన్ JioPhone Prima ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ జియో ఫీచర్ ఫోన్ బిగ్ డిస్ప్లేతో వస్తుంది మరియు వాట్సాప్, యూట్యూబ్ ను కూడా ఇందులో ఆనందించవచ్చు. చాలా చవక ధరలో మరిన్ని ప్రయోజనాలతో రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు సేల్ వివరాలు తెలుసుకోండి.

JioPhone Prima Price & Sale

జియోప్రైమా ఫోన్

జియోప్రైమా ఫీచర్ ఫోన్ ను కంపెనీ రూ. 2,599 ధరలో లాంచ్ చేయండి. ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ Amazon, JioMart, మరియు Reliance Digital తో పాటుగా అన్ని ప్రధాన అవుట్ లెట్ లలో ఈ ఫీచర్ లభిస్తుంది. అమేజాన్ నుండి ఈ ఫోన్ ను కొనడానికి Buy From Here పైన నొక్కండి.

జియోప్రైమా ఫోన్ ఫీచర్స్

ఈ జియోప్రైమా ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫీచర్ ఫోన్ 2.4 పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ దేశంలోని 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది మరియు మంచి కీప్యాడ్ ను కూడా కలిగివుంది. ఈ జియో ఫోన్ Kai-OS పైన పని చేస్తుంది మరియు YouTube, Facebook, WhatsApp మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ లతో వస్తుంది.

ఈ ఫీచర్ ఫోన్ లో JioTV, JioCinema, JioSaavn మరియు JioPay తో కూడిన UPI Payment సపోర్ట్ ను కూడా రిలయన్స్ జియో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో వెనుక కెమేరాని కూడా కలిగి వుంది.

Also Read : Flipkart Great Deal: భారీ తగ్గింపుతో 40 వేలకే 65 ఇంచ్ Smart TV అందుకోండి.!

జియోప్రైమా ప్లాన్స్

ఈ జియోప్రైమా ఫోన్ తో కంపెనీ ఎటువంటి ప్రత్యేకమైన ప్లాన్ లను కంపెనీ అనౌన్స్ చెయ్యలేదు. అయితే, జియోఫోన్ యొక్క అన్ని ప్లాన్స్ ఈ ఫోన్ పైన వర్తిస్తాయని జియో తెలిపింది. JioPhone ప్లాన్స్ మరియు JioBharat ప్లాన్స్ మధ్య వ్యతాసం ఉందని గమనించాలి.

అంటే, జియోప్రైమా ఫోన్ తో కేవలం జియోఫోన్ ప్లాన్స్ లో ఏదైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ, జియో భారత్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈ ఫోన్ కొనే వారికి వర్తించవచ్చు అని గుర్తు పెట్టుకోండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :