JIO సునామి : కేవలం రూ.699 రుపాయిలకే జియో 4G ఫోన్ అందిస్తోంది

Updated on 14-Oct-2019
HIGHLIGHTS

jio.com నుండి ఆన్లైన్ లో మరియు జియో స్టోర్ నుండి కూడా కొనవచ్చు.

దీపావళి 2019 పండుగ కోసం జియో వినియోగదారులకు మంచి అఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకూ, ఎక్స్చేంజి మరియు ఇతర ఆఫర్లతో అమ్ముడుచేస్తున జియో ఫీచర్ ఫోన్ను,ఇప్పుడు ఈ పండుగ సేల్ ద్వారా ఎటువంటి ఎక్స్చేంజి మరియు ఇతర కండిషన్స్ లేకుండా కేవలం 699 రూపాయల తగ్గింపు ధరతో అమ్మడుచేస్తోంది. ఈ ఫీచర్ ఫోన్‌ను ఎటువంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండా డిస్కౌంట్ ధర వద్ద అమ్మనుంది. ఈ పరిమిత ఆఫర్ దసరా మరియు దీపావళి మధ్య మాత్రమే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

1,500 రూపాయల ధరతో రిలయన్స్ జియోఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. దీపావళి 2019 ఆఫర్ సందర్భంగా ఈ 4G ఫీచర్ ఫోన్‌ను రూ .699 కు ఆఫర్ చేస్తున్నారు. ఈ పండుగ సీజన్ సందర్భంగా ఈ ఫోన్ పైన 801 రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్ యొక్క ప్రత్యేక విషయం ఏమిటంటే, వినియోగదారులు ఈ డిస్కౌంట్ రేటుతో కొనుగోలు చేయడానికి బదులుగా పాత ఫోన్‌ను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫోన్ యొక్క సేల్ నుండి jio.com  నుండి ఆన్లైన్ లో మరియు జియో స్టోర్ నుండి కూడా కొనవచ్చు. 

699 రూపాయలకు జియోఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు రూ .700 వరకు డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈఫోన్ ప్రారంభ 7 రీఛార్జిల కోసం కంపెనీ రూ .99 విలువైన అదనపు డేటాను కూడా అందిస్తుంది. వినియోగదారులు వినోదం, చెల్లింపు మరియు ఇ-కామర్స్ యాప్స్ కోసం ఈ అదనపు డేటాను ఉపయోగించవచ్చు.

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ జియోఫోన్ ఒక 2.4-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. మరియు దీని డిజైన్ మార్కెట్‌లోని ఇతర ఫీచర్ ఫోన్‌ల మాదిరిగానే ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ KAI OS లో నడుస్తుంది మరియు స్ప్రెడ్‌ట్రమ్ 9820A లేదా డ్యూయల్ కోర్ క్వాల్కమ్ 205 ప్రాసెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జియో టివి, జియో సినిమా, జియో మ్యూజిక్ వంటి అనేక జియో యాప్‌లతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :