JioBharat Diwali Dhamaka: కేవలం రూ. 699 ధరకే కొత్త 4G ఫోన్ అందుకోండి.!
రిలయన్స్ జియో మరొక దివాళి ధమాకా ఆఫర్ ను అనౌన్స్ చేసింది
JioBharat Diwali Dhamaka పేరుతో కొత్త ఫోన్ ను కేవలం రూ. 699 ధరకే ఆఫర్ చేస్తోంది
ఈ కొత్త ఫోన్ ఆఫర్లు మరియు వివరాలు తెలుసుకోండి
రిలయన్స్ జియో మరొక దివాళి ధమాకా ఆఫర్ ను అనౌన్స్ చేసింది. JioBharat Diwali Dhamaka పేరుతో కొత్త ఫోన్ ను కేవలం రూ. 699 ధరకే ఆఫర్ చేస్తోంది. 2024 దీపావళి పండుగ కోసం ఈ ఈ బిగ్ ఆఫర్ ను అందించింది. జియో కొత్తగా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ 4G ఫోన్ ను ఆఫర్ ధరతో అందుకోవచ్చు. మరి ఈ కొత్త ఫోన్ ఆఫర్లు మరియు వివరాలు తెలుసుకోండి.
SurveyJioBharat Diwali Dhamaka
జియో ఈ దీపావళి పండుగ కోసం ఈ బిగ్ డీల్ ను అందించింది. నిన్నటి వరకు రూ. 999 ధరతో సేల్ అయిన జియో అందించి బడ్జెట్ 4g ఫోన్ Karbonn Bharat K1, ఇప్పుడు ఆఫర్ కొత్త ఆఫర్ తో కేవలం రూ. 699 ధరకే లభిస్తుంది. అయితే, ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ గా మాత్రమే జియో అందించింది. ఈ ఫోన్ ను , JioMart మరియు Amazon నుంచి కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది.
JioBharat Diwali Dhamaka : రీఛార్జ్ ఆఫర్

ఈ ఫోన్ జియో యొక్క అతి తక్కువ ఖర్చులో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 123 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో జతగా వస్తుంది. ఈ రీచార్జ్ తో ఈ ఫోన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 0.5GB చొప్పున 14 GB డేటా అందిస్తుంది. ఈ రీఛార్జ్ తో ఈ ఫోన్ 455 కి పైగా Live TV లకు యాక్సెస్ అందిస్తుంది మరియు జియో సినిమా తో మూవీస్ అండ్ షోస్ కి యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Poco F6 Deal: పోకో పవర్ ఫుల్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ ఆఫర్ అందుకోండి.!
JioBharat Phone : ఫీచర్స్
జియో ఆఫర్ ధరతో అందిస్తున్న ఈ Karbonn Bharat K1 ఫీచర్ ఫోన్ పెద్ద స్క్రీన్, లాంగ్ బ్యాటరీ మరియు పెద్ద కీ ప్యాడ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో చూపు తిప్పుకోలేని ఆఫర్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile