జియో ఫీచర్ ఫోన్ దీపావళి అఫర్ :JIO PHONE మంచి గిఫ్ట్ గా ఇవ్వవచ్చు

Updated on 25-Oct-2019
HIGHLIGHTS

ఒక అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికోసం

ఈ దీపావళికి నచ్చిన వారికీ దగ్గరగా ఉండేలా మరియు వారు మిమ్మల్ని గుర్తుంచుకునేలా ఒక అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికోసం, జియో ప్రకటించిన దీపావళి అఫర్ నిజంగా సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే, మీరు కేవలం 808 రుపాయలతో ఒక ఫీచర్ ఫోనుతో పాటుగా ఒక నెలకు సరిపడా రీఛార్జిని కూడా గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. అంతేనా, అనుకుంటున్నారా అంతేకాదు ఇంకా చాల ఆఫర్లనే ప్రకటించింది. అధనంగా, ఈ ఫోన్ ని ఒక గిఫ్ట్ వోచర్ రూపంలో వారికీ పంపవచ్చు మరియు ఈ గిఫ్ట్ అందుకున్నవారు ఇండియాలోని ఏదైనా ఈ వోచరును ఉపయోగించి ఒక కొత్త జియో ఫీచర్ ఫోన్ను పొందవచ్చు.    

జియో ఆఫర్ వివరాలు

1. Rs. 808  గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 1 నెల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది

2. Rs.1,006 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 3 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది            

3. Rs.1,501 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 8 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది

4. Rs.1,996 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 13 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది  

వాస్తవానికి,ఈ దీపావళి సందర్భంగా ఈ ఫీచర్ ఫోన్ను కేవలం రూ.699 రూపాయల ధరకే అమ్ముడుచేస్తోంది. అయితే, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారు కొత్త కనెక్షన్ కోసం  మరొక 100 రుబయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈ ఫోన్ దీపావళి ఆఫరుతో కొనేవారికి ఒక నెల రీఛార్జిని కూడా అందిస్తోంది మరియు మొదటి 7 రీఛార్జ్ లకు గాను 99 రుపాయల్ విలువగల డేటా ప్రయోజనాన్ని కూడా అందుకోవచ్చు. అంటే 7 రీఛార్జ్ లకు 99 రూపాయల విలువగల డేటా అంటే 693 రూపాయల  లాభం మీకు అందుతుంది.                  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :