రూ.4,999 ధరకే డ్యూయల్ కెమేరా మరియు డ్యూయల్ VoLTE స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 25-Sep-2019

ఈరోజు ఐటెల్ తన A46 స్మార్ట్‌ ఫోన్ యొక్క 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ వేరియంట్ ధర 4,999 రూపాయలుగా ప్రకటించింది. ఈ సంస్థ ఇప్పటికే ఈఫోన్ యొక్క  2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లను విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లను భారతదేశంలోని అన్ని రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ గ్రే, ఫైరీ రెడ్, నియాన్ వాటర్ మరియు డార్క్ వాటర్ కలర్‌లో లభిస్తుంది.

ఐటెల్ A46 ప్రత్యేకతలు

ఐటెల్ A46 ఫోన్ ఒక 5.45 అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది, దీని రిజల్యూషన్ 1440 x 720 పిక్సెల్స్ గా ఉంటుంది. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు స్టోరేజిను పెంచడానికి ఒక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ ఉంది మరియు ఈ ఫోన్  ఫేస్ అన్‌లాక్‌తో కూడా వస్తుంది.

ఆప్టిక్స్ గురించి మాట్లాడితే, ఈ పరికరం డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, దీనిలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో వీజీఏ సెకండ్ కెమెరా ఉన్నాయి. కెమెరా సెటప్‌లో AI సీన్ డిటెక్షన్ కూడా ఉంది, అలాగే కెమెరా లక్షణాలలో ఫేస్ బ్యూటీ, పోర్ట్రెయిట్ మోడ్ మరియు బోకె మోడ్ ఫీచర్ ఉన్నాయి.

ఈ ఐటెల్ A46 ఆండ్రాయిడ్ 9.0 పై OS తో వస్తుంది  మరియు ఈఫోన్ ఒక 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోనులో డ్యూయల్ 4G VoLTE , బ్లూటూత్ 4.2, వైఫై, జిపిఎస్, డ్యూయల్ సిమ్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :