కేవలం రూ.5,499 రూపాయలకే డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికీ మరొక ఎంపిక మార్కెట్ లో ప్రవేశించింది. Itel కంపెనీ తన మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Itel A47 ను విడుదల చేసింది. A47 పెద్ద స్క్రీన్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది.
Itel A47 ఫిబ్రవరి 5 నుండి అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. `
ఈ Itel A47 స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల LCD IPS డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ యొక్క క్వాడ్-కోర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 2GB ర్యామ్ వస్తుంది. ఇక ఈ ఫోన్ 32 ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా మేక్రో SD కార్డు సహాయంతో 32 GB వరకూ స్టోరేజ్ ను పెంచవచ్చు. సెక్యూరిటీ కోసం ఇందులో వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా అందించింది.
కెమెరాల విషయానికి వస్తే, Itel ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో ప్రధాన 5MP కెమెరాకి జతగా VGA కెమెరాని కలిపి డ్యూయల్ కెమెరాని అందించింది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 MP సెల్ఫీ కెమెరాని కూడా ఇచ్చింది. ఈ ఫోన్ మొత్తానికి పవర్ ఇవ్వడానికి 3000 mAh బ్యాటరీని కలిగివుంది.