iQOO Z9 Lite 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు Dimensity 6300 తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

ఐకూ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది

iQOO Z9 Lite 5G ను విడుదల చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది

ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు Dimensity 6300 తో లాంచ్ అవుతుంది

iQOO Z9 Lite 5G: ఐకూ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇటీవల ఐకూ విడుదల చేసింది iQOO Z9 ఫోన్ యొక్క లైట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ ఐకూ జెడ్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు Dimensity 6300 తో లాంచ్ అవుతుంది.

iQOO Z9 Lite 5G: లాంచ్ డేట్

ఐకూ జెడ్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ను జూలై 15 వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది.

Also Read: Moto G85: డిఫరెంట్ కలర్స్ మరియు స్టైల్ తో లాంచ్ కి సిద్ధం అయ్యింది.!

iQOO Z9 Lite 5G: ఫీచర్లు

ఈ ఫోన్ డిజైన్ తో పాటు కొన్ని ఇతర ఫీచర్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ ను 6nm చిప్ సెట్ Dimensity 6300 తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ చిప్ సెట్ 414K+ AnTuTu స్కోర్ ను అందిస్తుందని కూడా తెలిపింది. అయితే, ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ఈ స్కోర్ ను అందించిందని తెలిపింది. అంటే, ఇది ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ అయ్యే అవకాశం ఉండవచ్చు. కాబట్టి, దీని కంటే తక్కువ ర్యామ్ కలిగిన మరో వేరియంట్ ఉండే అవకాశం ఉంటుంది.

iQOO Z9 Lite 5G Processor

ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూడవచ్చు. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్లీక్ డిజైన్ ను కలిగి ఉంది మరియు ఆకర్షణీయమైన కలర్ లో కన్పిస్తోంది. అలాగే, ఈ ఫోన్ పై భాగంలో పెద్ద స్పీకర్ గ్రిల్ కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్ సెటప్ వుండే అవకాశం వుంది. ఇప్పటి వరకూ ఐకూ Z సిరీస్ నుండి గొప్ప ఫోన్ లను అందించింది.

అందుకే, ఐకూ ఇదే సిరీస్ నుండి విడుదల చేయబోతున్న అప్ కమింగ్ ఫోన్ ఐకూ Z9 లైట్ ఫోన్ కూడా గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ నాటికి కంపెనీ ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు బయటపెట్టే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :