iQOO Z10R price and complete features
iQOO Z10R స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి కంటే ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ వివరాలు తెలుసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ ను 4K వీడియో రికార్డ్ చేయగల మెయిన్ మరియు సెల్ఫీ కెమెరా లతో పాటు గొప్ప అల్ట్రా స్లిమ్ డిజైన్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ ను వివో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ఇక్కడ ఉంది.
ఈ ఫోన్ జూలై 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ మరియు ఐకూ అందించిన ప్రత్యేకమైన టీజర్ మైక్రో సైట్ పేజి నుంచి ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ కూడా అందించాయి.
ఈ ఐకూ జెడ్ 10ఆర్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ ను కేవలం 7.3mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో అంచులు కానీ కనిపించని విధంగా క్వాడ్ కర్వుడ్ బౌండ్ లెస్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. జెడ్ 10ఆర్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12 జీబీ ఫిజికల్ ర్యామ్, 12 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 256 జీబీ గొప్ప స్టోరేజ్ ఉంటాయి. ఈ ఐకూ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.
జెడ్ 10ఆర్ స్మార్ట్ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX882 మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక రెండు కెమెరాలు కూడా 4K Video రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ మరియు గుట్టల కొద్దీ ఐకూ కెమెరా ఫిల్టర్స్ కూడా ఉంటాయి.
ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ లో 5700 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ తో గట్టిగా, IP 69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఐకూ అప్ కమింగ్ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో గొప్ప కూలింగ్ సిస్టం ఉన్నట్లు ఐకూ తెలిపింది.
Also Read: సేల్ ముగిసిన తర్వాత కూడా బడ్జెట్ ధరలో లభిస్తున్న SONY 5.1ch Dolby సౌండ్ బార్.!
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ ఫోన్ గా ఇండియాలో విడుదల అవుతుందని, టీజర్ పేజీ ద్వారా ఐకూ స్వయంగా ప్రకటించింది. ఈ ఫోన్ ఆక్వా మెరైన్ మరియు మూన్ స్టోన్ రెండు రంగుల్లో లభిస్తుంది.