iQOO Z10R launching with boundless AMOLED and 32mp 4k selfie camera
iQOO Z10R: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ను బౌండ్ లెస్ AMOLED మరియు 32MP 4K సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ టీజర్ ద్వారా బయట పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.
ఐకూ జెడ్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ జూలై 24న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ అవుతుంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ చేస్తోంది.
ఐకూ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్, డిస్ప్లే మరియు కెమెరా గురించి కంపెనీ కీలకమైన వివరాలు వెల్లడించింది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ కేవలం 7.39mm అల్ట్రా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా సన్నగా ఉన్నా కూడా ఈ ఫోన్ లో భారీ 5700 mAh బ్యాటరీ అందించడం విశేషంగా చెబుతోంది. ఈ ఫోన్ మరింత సన్నగా కనిపించేలా మరియు ఈ ఫోన్ మరింత సుందరంగా మార్చేలా ఈ ఫోన్ బౌండ్ లెస్ AMOLED (క్వాడ్ కర్వుడ్ ) స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ స్మూత్ గా నడిచేలా 120Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో నేటి యువతరానికి తగిన మరియు సమర్ధవంతమైన కెమెరా సెటప్ అందించినట్లు ఐకూ చెబుతోంది. ఇందులో వెనుక 50MP Sony IMX882 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 32MP 4K సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంటే, ఈ ఫోన్ రియర్ మరియు సెల్ఫీ కెమెరా తో కూడా 4K వీడియో షూట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ను IP 68 మరియు IP 69 రేటింగ్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ మంచి డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా అర్థం అవుతుంది.
Also Read: ప్రైమ్ సేల్ తర్వాత బిగ్ డిస్కౌంట్ అందుకున్న NARZO 80 Pro 5G స్మార్ట్ ఫోన్.!
ఐకూ జెడ్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ ను రూ. 20,000 రూపాయల బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ ఈ ఫోన్ ప్రైస్ అఫిషియల్ గా అనౌన్స్ చేసే వరకు మనం వేచి చూడాల్సిందే.