iQOO Z10R: భారీ సింగల్ డే ఆఫర్స్ తో మొదటి సేల్ కోసం సిద్ధమైన ఐకూ కొత్త ఫోన్.!

Updated on 28-Jul-2025

iQOO Z10R: ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ జెడ్ 10 ఆర్ భారీ ఆఫర్లతో మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఐకూ ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది మరియు ఈ ఫోన్ మరింత తక్కువ ధరలో అందుకోవడానికి వీలుగా గొప్ప సింగల్ డే ఆఫర్లు కూడా అందించింది.

iQOO Z10R: ప్రైస్ అండ్ ఆఫర్లు

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది ఈ ఫోన్ ధరలు క్రింద చూడవచ్చు.

ఐకూ జెడ్ 10R ప్రైస్ (8జీబీ + 128జీబీ) ధర : రూ . 19,499

ఐకూ జెడ్ 10R ప్రైస్ (8జీబీ + 256జీబీ) ధర : రూ . 21,499

ఐకూ జెడ్ 10R ప్రైస్ (12జీబీ + 256జీబీ) ధర : రూ . 23,499

ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్లు ఐకూ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే యూజర్ కు లభిస్తుంది.

ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 17,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్లు కేవలం మొదటి సేల్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ను 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలంటే ఫస్ట్ డే సేల్ నుంచి ఈ ఫోన్ ను అందిపుచ్చుకోవాలి.

Also Read: Great Freedom Festival Sale అనౌన్స్ చేసిన అమెజాన్ ఇండియా.!

iQOO Z10R: ఫీచర్లు

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.39mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు ఇందులో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, నెట్ ఫ్లిక్స్ HDR సపోర్ట్ తో పాటు స్కాట్ ఆల్ఫా గ్లాస్ సేఫ్టీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ కోయ్త్త చిప్ సెట్ Dimensity 7400, 8GB / 12GB ఫిజికల్ ర్యామ్, 12 జీబీ వరకు అదనపు ర్యామ్ తో పాటు 256 జీబీ వరకు గొప్ప స్టోరేజ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ కంప్లీట్ 4K వీడియో రికార్డింగ్ కెమెరాలు కలిగివుంది. అంటే, మెయిన్ మరియు సెల్ఫీ కెమెరా కోడోత్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో, 50MP (Sony IMX 882) ప్రధాన కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 5700 mAh బిగ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP 68 + IP 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :