iQOO Z10 Lite 5G: బడ్జెట్ ధరలో 6000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Updated on 18-Jun-2025
HIGHLIGHTS

ఐకూ జెడ్ సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది

iQOO Z10 Lite 5G ను 10 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 6000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసినట్లు ఐకూ తెలిపింది

iQOO Z10 Lite 5G: ఐకూ జెడ్ సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 6000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసినట్లు ఐకూ తెలిపింది. ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

iQOO Z10 Lite 5G: ప్రైస్

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ బేసిక్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (6GB + 128GB) రూ . 10,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. అమెజాన్ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్లు

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: OnePlus Buds 4: డ్యూయల్ స్పీకర్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!

iQOO Z10 Lite 5G: ఫీచర్లు

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 ఇంచ్ డిస్ప్లే తో అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు పంచ్ వాటర్ డ్రాప్ సెల్ఫీ డిజైన్ కలిగి ఉంటుంది. ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్, 8GB అదనపు ర్యామ్ సపోర్ట్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

ఈ ఐకూ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ తో పాటు IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ సైబర్ గ్రీన్ మరియు టైటానియం బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ లో మంచి సౌండ్ అందించే స్టీరియో స్పీకర్ కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :