iQOO Z10 5G: దేశంలో బడ్జెట్ ధరలో అతిపెద్ద బ్యాటరీ ఫోన్ గా అవతరించింది.!

HIGHLIGHTS

ఐకూ చాలా కాలంగా ఐకూ టీజింగ్ చేస్తున్న ఐకూ జెడ్ 10 5జి ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది

iQOO Z10 5G అతిపెద్ద బ్యాటరీ ఫోన్ గా అవతరించింది

ఈ ఫోన్ ను ఆఫర్స్ తో కలిపి కేవలం 20 వేల బడ్జెట్ ధరలో అందించింది

iQOO Z10 5G: భారతదేశ అతిపెద్ద బ్యాటరీ ఫోన్ అని ఐకూ చాలా కాలంగా ఐకూ టీజింగ్ చేస్తున్న ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ఆఫర్స్ తో కలిపి కేవలం 20 వేల బడ్జెట్ ధరలో అందించింది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్లు పూర్తిగా తెలుసుకోండి.

iQOO Z10 5G: ప్రైస్

ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

ఐకూ జెడ్ 10 5జి (8GB + 128GB) ధర : రూ. 21,999

ఐకూ జెడ్ 10 5జి (8GB + 256GB) ధర : రూ. 23,999

ఐకూ జెడ్ 10 5జి (12GB + 256GB) ధర : రూ. 25,999

ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ amazon నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై సింగిల్ డే సూపర్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ లేదా రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అందుకునే అవకాశం అందించింది. ఈ ఫోన్ ను SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 16వ తేదీ జరిగే ఫస్ట్ సేల్ కోసం మాత్రమే అందించిందని.

Also Read: iQOO Z10x 5G: బడ్జెట్ ధరలో 6500 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది.!

iQOO Z10 5G: ఫీచర్స్

ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్, 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో టోటల్ 24GB ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony IMX882 OIS మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో సపోర్ట్ తో వస్తుంది మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7300 mAh భారీ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు సూపర్ స్లీక్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :