iQOO Neo9 Pro Launch అనౌన్స్ చేసిన ఐకూ..కొత్త స్క్వేర్ కెమేరా సెటప్ తో వస్తోంది.!
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO Neo9 Pro Launch అనౌన్స్
కొత్త స్క్వేర్ కెమేరా సెటప్ తో వస్తున్న కొత్త ఫోన్
డ్యూయల్ కలర్ లెథర్ ప్యానల్ తో చూడ చక్కగా కనిపిస్తోంది
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO Neo9 Pro Launch అనౌన్స్ చేసిన ఐకూ. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కొత్త స్క్వేర్ కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు కూడా కంపెనీ అన్నౌన్స్ చేసింది. ఐకూ నియో9 ప్రో స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కలర్ లెథర్ ప్యానల్ తో చూడ చక్కగా కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పోస్టర్ మరియు పేజ్ ద్వారా కీలమైన స్పెక్స్ ను కూడా కంపెనీ బయట పెట్టింది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ వివరాలేమిటో తెలుసుకుందామా.
SurveyiQOO Neo9 Pro Launch
ఐకూ నియో9 ప్రో లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. మంచి ఫోటోలను మరియు రిచ్ కలర్ లాలను అందించడానికి వీలుగా ఈ కెమేరా సెటప్ కి జతగా వైబ్రాంట్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ సపోర్ట్ వుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ ఫినిష్ మరియు డ్యూయల్ కలర్ మిక్స్ తో ఆకట్టుకుంటోంది.

ఈ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు ఈ పేజ్ నుండి టీజింగ్ మొదలు పెట్టింది.
Also Read : Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
ఐకూ నియో9 ప్రో లాంచ్ ఎప్పుడు?
అంతా బాగానే వుంది అసలు విషయమైన ఐకూ నియో9 ప్రో లాంచ్ డేట్ గురించి చెప్పరేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఐకూ నియో9 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 2024 లో ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు ఐకూ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ఖచ్చితమైన లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile