iQOO Neo 10R launching with two different colors and powerful chipset in india
iQOO Neo 10R: ఐకూ నియో సిరీస్ నుంచి ఒక సంవత్సరం తర్వాత కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రెండు డిఫరెంట్ కలర్స్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే డిజైన్ మరియు కలర్ తో తీసుకొస్తున్నట్లు టీజర్ ఇమేజ్ చూస్తుంటే అర్ధం అవుతోంది.
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను మార్చి 11వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు మరియు మరిన్ని వివరాలతో అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీతో టీజింగ్ చేస్తోంది.
Also Read: ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 525W Dolby 5.1 Soundbar డీల్ పై ఒక లుక్కేయండి.!
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రోసెసర్ తో 1.7 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుందని ఐకూ తెలిపింది. ఇక ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
ఇవి కాకుండా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్ వివరాలు కూడా ఐకూ అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ మరియు మూన్ నైట్ టైటానియం రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో బిల్ట్ ఇన్ FPS మేటర్ కలిగిన అల్ట్రా గేమ్ మోడ్ ఉన్నట్లు కూడా ఐకూ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 2000Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన డిస్ప్లే ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా బయటకు వచ్చే అవకాశం వుంది.