iQOO Neo 10 launching with super bright screen and Sony camera
iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చేపట్టిన టీజర్ పేజీ నుంచి ఈరోజు కొత్త అప్డేట్ లను అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సూపర్ బ్రైట్ స్క్రీన్ మరియు Sony కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ కొత్త టీజర్ అందించింది. ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ వెల్లడించింది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ మే 26వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది మరియు ఈరోజు ఈ పేజీ నుండి లేటెస్ట్ అప్డేట్ అందించింది.
ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బ్రైటెస్ట్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు ఐకూ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K సూపర్ HD రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే మరియు వైబ్రాంట్ గా కనిస్తోంది.
ఇది కాకుండా ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు కూడా కొత్తగా వెల్లడించింది. ఈ ఫోన్ లో 50MP Sony (OIS) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కెమెరా సూపర్ నైట్ మోడ్ మరియు ప్రత్యేకమైన పోర్ట్రైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా ఐకూ వెల్లడించింది.
ఇక ఈ ఫోన్ గురించి ముందే కంపెనీ వెల్లడించిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. దీనికి జతగా LPDDR5X అల్ట్రా ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.42 Mn+ AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుందని కూడా ఐకూ తెలిపింది. అంతేకాదు, ఇందులో ఐకూ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది.
Also Read: Android 16 ను మరింత సౌకర్యవంతంగా ఆవిష్కరించిన గూగుల్.!
ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ భారీ 7000 mAh బ్యాటరీ మరియు 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 8.09mm మందంతో చాలా స్లీక్ ఉంటుందని కూడా ఐకూ వివరాలు అందించింది.