iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఐకూ.!

Updated on 05-May-2025
HIGHLIGHTS

iQOO Neo 10 ను ఇండియాలో విడుదల చేస్తునట్లు ఐకూ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను డిఫరెంట్ కలర్ లో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ చెబుతోంది

ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది

iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తునట్లు ఐకూ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను డిఫరెంట్ కలర్ లో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ చెబుతోంది. ఇటీవల ఐకూ Z10 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్స్ విడుదల చేసిన ఐకూ ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ వివరాలు మరియు ఇతర వివరాలు చూద్దామా.

iQOO Neo 10 : లాంచ్

ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ ను ఐకూ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు చెబుతూ ‘Coming Soon’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ మరియు కొన్ని కీలకమైన వివరాలు తెలియజేసే టీజర్ ఇమేజ్ లను మాత్రం ప్రస్తుతానికి అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకొస్తున్నట్లు కూడా ఐకూ తెలిపింది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.

iQOO Neo 10 : ఫీచర్స్

ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు కూడా అందించలేదు. అయితే, ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. అవేమిటంటే, ఈ ఫోన్ ను ఐకూ Z సిరీస్ మాదిరి డిజైన్ తో అందిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ సరికొత్త ఆరంజ్ కలర్ ఆప్షన్ లో వస్తున్నట్టు కనిపిస్తోంది.

అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు కూడా ఈ ఇమేజ్ ద్వారా బయట పెట్టింది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో ASPH డ్యూయల్ కెమెరా ఉన్నట్లు ఐకూ తెలిపింది. ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ లో పెద్ద కెమెరా బంప్ ఉంటుంది మరియు ఈ బంప్ లో ఈ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

Also Read: Flipkart SASA LELE సేల్ నుంచి లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్ డిస్కౌంట్ అందుకోండి.!

ఐకూ నియో 10 : అంచనా ఫీచర్స్

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ అంచనా స్పెక్స్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి జతగా ఈ ఫోన్ లో 16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ మరియు UFS 4.1 హెవీ స్టోరేజ్ ను కూడా అందించే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

అయితే, ఐకూ అధికారికంగా ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, త్వరలోనే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :