iqoo launches iQOO Z11 with stunning design and features in India
iQOO Z11: ఐకూ ఇండియా ఈరోజు గొప్ప ఫీచర్స్ తో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ అండ్ బ్యూటిపుల్ కర్వుడ్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ బిల్ట్ ఇన్ AI సపోర్ట్ మరియు లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ కూడా కలిగి ఉంటుంది. ఐకూ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఏమిటో చూసేద్దామా.
ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ను ఏకంగా నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ నాలుగు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ అందించాము.
ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ పై భారీ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి ఆగస్టు 25వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఇతర అన్ని వేరియంట్స్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా రూ. 1,000 అదనపు డిస్కౌంట్ మరియు 3 అండ్ 6 నెలల No Cost EMI ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.
Also Read: Dolby Soundbar: సేల్ ముగిసిన తర్వాత కూడా అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్.!
ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే సరికొత్తగా డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.83 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7500 Turbo చిప్ సెట్ తో నడుస్తుంది మరియు గరిష్టంగా 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ సెటప్ లో 50MP (Sony IMX 882) + 8MP (అల్ట్రా – వైడ్) కెమెరాలు ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన వివో కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS 6.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. ఇది 3 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 7050 mAh బిగ్ బ్యాటరీని ఐకూ అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన ఆరిజిన్ ఐల్యాండ్ ఫీచర్ తో కూడా ఐకూ అందించింది.