iqoo announced big deals on iQOO Z10 5G from 6th anniversary sale
ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఐకూ 6వ వార్షికోత్సవ సేల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ ఇండియా నుంచి ప్రకటించిన ఈ బిగ్ సేల్ నుంచి ఐకూ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ iQOO Z10 5G పై బిగ్ డీల్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ ని మంచి డిస్కౌంట్ ధరలో అందుకొండని ఐకూ ప్రకటించింది. మరి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఐకూ అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.
ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 24,999 రూపాయల ధరతో లిస్ట్ చేసిన ఐకూ, ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ (2392 × 1080), 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 4nm టెక్నాలజీ ప్రోసెసర్ మరియు 8 లక్షల వరకు AnTuTu స్కోర్ అందిస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony IMX 882 (OIS) మెయిన్ కెమెరా మరియు 2MP బోకే కెమెరా ఉంటాయి. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ డీల్ ఈరోజు మిస్సయితే మళ్ళీ దొరకదు.!
ఈ ఐకూ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్ తో మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ తో వస్తుంది.