iQOO 16 ఇండియా లాంచ్ అండ్ కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఐకూ .. ఫాస్ట్ చిప్ సెట్ తో వస్తోంది.!

Highlights

iQOO 16 ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

ప్రీమియం ఫీచర్స్ తో ఉంటుందని ఇప్పటికే లీక్స్ అండ్ మార్కెట్ వర్గాల అంచనాలు

Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్

iQOO 16 స్మార్ట్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో విడుదల చేయబోతున్నట్లు కూడా కంపెనీ టీజర్ విడుదల చేసింది. ఐకూ లాంచ్ చేయబోతున్న ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో ఉంటుందని ఇప్పటికే లీక్స్ అండ్ మార్కెట్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.

iQOO 16 ఇండియాలో లాంచ్ డేట్ ఏమిటి?

ప్రస్తుతానికి ఐకూ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టైం ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం విడుదల చేసిన టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలక వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీని కూడా అందించింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు.

iQOO 16 కీలక ఫీచర్స్ ఏమిటి?

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అలాంచి కోసం కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా, ఐకూ 16 ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది క్వాల్కమ్ ఈ అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌ ను 2026 సెప్టెంబర్ 22న అధికారికంగా పరిచయం చేసింది. ఇది 2nm టెక్నాలజీ పై తయారు చేసిన చిప్ సెట్ మరియు ఇది ఏకంగా 5GHz వరకు గరిష్ట వేగంతో పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కంపెనీ టీజర్ లో వెల్లడించింది.

అంచనా స్పెక్స్

ఐకూ 16 స్మార్ట్‌ ఫోన్‌ లో 6.85 అంగుళాల బోగ్ M16 LTPO AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 2K+ హై రిజల్యూషన్ మరియు 10,000 నిట్స్ భారీ లోకల్ పీక్ బ్రైట్‌ నెస్‌ కు సపోర్ట్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌ తో పాటు ప్రత్యేక Q4 గేమింగ్ చిప్‌ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. సాఫ్ట్‌ వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Android 17 ఆధారిత OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేయవచ్చని సమాచారం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile