iQOO 15R sale భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో స్టార్ట్ అయ్యింది.!

HIGHLIGHTS

iQOO 15R sale ఈరోజు భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను అత్యంత వేగవంతమైన ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో అందించింది

ఐకూ ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అందించింది

iQOO 15R sale ఈరోజు భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను అత్యంత వేగవంతమైన ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఐకూ ఈ ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అందించింది. ఈ డీల్స్ తో ఈ లెట్స్ ఐకూ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

iQOO 15R sale : ప్రైస్ అండ్ ఆఫర్స్

ఐకూ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం

ఐకూ 15R (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 44,999

ఐకూ 15R (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 47,999

ఐకూ 15R (12 జీబీ + 512 జీబీ) ప్రైస్ : రూ. 52,999

ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు డార్క్ నైట్ అండ్ ట్రంప్ సిల్వర్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా మరియు ఐకూ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతోంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఐకూ ఈ ఫోన్ పై ఈ ఫోన్ పై ICICI, HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ పై రూ. 4,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 40,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.

Also Read: Honor Robot Phone గురించి ఎవరికీ తెలియని ప్రత్యేకమైన ఫీచర్స్.. తెలుసుకోండి.!

iQOO 15R : ఫీచర్స్

ఐకూ 15 ఆర్ కాంపాక్ట్ సైజులో అంటే, 6.59 అంగుళాల పరిమాణం కలిగిన AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ చిప్ సెట్ తో అందించింది. ఇందులో క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్, Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ మరియు నెట్ వర్క్ ఎం హెన్స్ మెంట్ చిప్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో ఉంది 3nm టెక్నాలజీ ప్రోసెసర్ మరియు ఇది 3.5 మిలియన్ పైచిలుకు AnTuTu స్కోర్ అఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఐకూ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ Sony LYT-700V సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో మరియు అద్భుతమైన Ai కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 7600mAh భారీ బ్యాటరీ, 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది IP68 అండ్ IP69 రేటింగ్ కలిగి గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :