iQOO 15R India launch and features announced today
iQOO 15R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లు కూడా ఈరోజు రివీల్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మస్ట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను చూడగానే ఆకట్టుకునే కొత్త డిజైన్ తో అందిస్తుంది. ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, డిజైన్ మరియు కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.
ఐకూ 15R స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం ఉంది. కేవలం లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ ఫోన్ కీలక వివరాలు తెలిపే పూర్తి డిజైన్ ఇమేజ్ ను కూడా ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది.
ఐకూ ఫోన్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు అందించింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 3nm టెక్నాలాజి చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో లాంచ్ చేయనున్నట్లు ఐకూ తెలిపింది. ఇది 3.5 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఇది గొప్ప పెర్ఫార్మన్స్ అందించే చిప్ సెట్ మరియు ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ గా లాంచ్ అవుతుంది.
ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది చూడగానే ఆకర్షించే సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ ఉంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ కోసం చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ త్వరలోనే రివీల్ చేస్తుంది.
Also Read: VIVO X200T: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో విడుదలైన వివో కొత్త ఫోన్.!
కొన్ని ఆన్లైన్ లీక్స్ కథనాల ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ అంచనా స్పెక్స్ మేము అందిస్తున్నాము. ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే కలిగి ఉండే అవకాశం వుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ గేమింగ్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 3D Ultrasonic ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఇదే కనుక నిజం అయితే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.